రాజకీయ వైషమ్యాలను వీడండి: సుప్రీం కోర్టు

రాజకీయ వైషమ్యాలను వీడండి: సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ: రాజకీయ వైషమ్యాలను వీడి, ప్రజా సమస్యల పరిష్కారానికి కలిసి పనిచేయాలని ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ కు, లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు సుప్రీం కోర్టు సూచించింది. ఢిల్లీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్(డీఈఆర్‌‌సీ) చైర్‌‌పర్సన్ నియామకంపై దాఖలైన పిటిషన్ ను కోర్టు సోమవారం విచారించింది. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న సీఎం, ఎల్జీలు రాజకీయ వైషమ్యాలకు అతీతంగా ప్రవర్తించాలని కోర్టు అభిప్రాయపడింది. డీఈఆర్‌‌సీ చైర్‌‌పర్సన్ ఎంపిక కోసం ఇద్దరూ కలిసి చర్చించి, నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఇందులో తాము జోక్యం చేసుకోవాలని అనుకోవడం లేదని తెలిపింది. ఈ కేసుపై తదుపరి విచారణను గురువారం చేపడతామని సుప్రీంకోర్టు పేర్కొంది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, ఆప్ సర్కార్ కు మధ్య కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ అధికారుల బదిలీలు, ట్రాన్స్ ఫర్ విషయాల్లో కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్ వల్ల ఈ దూరం మరింత పెరిగింది. 

ALSO READ:లోకల్ బాడీ బైపోల్స్ ఇంకెప్పుడు?.. రాష్ట్రవ్యాప్తంగా 6 వేలకు పైగా సీట్లు ఖాళీ