
అల్మాస్ పూర్ చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడిని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నెల రోజుల్లో ఉరి తీయాలని డిమాండ్ చేశారు ఐక్య వేదిక నాయకులు. చిన్నారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ దళిత, గిరిజన లంబాడిల ఐక్య వేదిక చేపట్టిన మహా శాంతి ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. నాంపల్లి నిలోఫర్ హాస్పిటల్ నుంచి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు ఐక్య వేదిక నాయకులు ర్యాలీని చేపట్టారు. తర్వాత అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రోడ్డుపై బైఠాయించేందుకు ఐక్య వేదిక నాయకులు యత్నించడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. చిన్నారికి ప్రభుత్వం కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలన్నారు. బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు, డబుల్ బెడ్ రూమ్ వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మరిన్ని వార్తల కోసం..
ఇండియా ఇంటికే: కివీస్ పై అఫ్గాన్ ఓటమి
జైలులో పోలీసులపై రాళ్లు రువ్విన ఖైదీలు
వివేక్ వెంకటస్వామి ఫొటోకు పాలాభిషేకం