జైలులో పోలీసులపై రాళ్లు రువ్విన ఖైదీలు

జైలులో పోలీసులపై రాళ్లు రువ్విన ఖైదీలు

ఉత్తరప్రదేశ్ లోని ఫరూఖాబాద్ జైలులో ఖైదీలు, పోలీసుల మధ్య ఘర్షణ జరిగింది. జిల్లా జైలులో ఓ ఖైదీ చనిపోయాడు. అతను డెంగీతో చికిత్స పొందుతూ చనిపోయాడని పోలీసులు ప్రకటించారు. అయితే ఖైదీ మృతితో మిగతా ఖైదీల్లో అలజడి ఏర్పడింది. పోలీసుల కారణంగానే ఖైదీ చనిపోయాడనే కోపంతో తోటి ఖైదీలు.. సెంట్రీలు, జైలు సిబ్బందిపై రాళ్లు రువ్వారు. కొన్ని వస్తువులను తగలబెట్టారు. ఘర్షణల కారణంగా... 32 మంది ఖైదీలు, 30 మంది పోలీస్ సిబ్బంది గాయపడ్డారు. అందులో ఇద్దరి పరిస్థితి తీవ్రంగా ఉంది. జైలులో ఘర్షణలతో భారీగా బలగాలను మోహరించారు. ప్రస్తుతం పరిస్థితులు అదుపులో ఉన్నాయని ఫరూఖాబాద్ జిల్లా అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తల కోసం..

పెట్రోల్‌పై రూ.10 తగ్గింపు.. తొలి కాంగ్రెస్ పాలిత రాష్ట్రం

పునీత్ ఫ్యామిలీ డాక్టర్ ఇంటి వద్ద భారీ భద్రత

ఆర్టీసీ ఛార్జీల పెంపు ప్రతిపాదనలు.. ఎంతంటే?