సీఎం వద్దకు ఆర్టీసీ ఛార్జీల పెంపు ఫైల్

సీఎం వద్దకు ఆర్టీసీ ఛార్జీల పెంపు ఫైల్

ఆర్టీసీ ఛార్జీలు పెంచేందుకు సిద్ధమైంది సర్కార్. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు సీఎం కేసీఆర్ కు పంపారు ఆర్టీసీ అధికారులు. పల్లె వెలుగుకు కిలోమీటర్ కు 25 పైసలు, ఎక్స్ ప్రెస్ ఆపైన బస్సులకు కిలోమీటర్ కు 30 పైసలు పెంచాలని నిర్ణయించారు. సిటీ ఆర్డినరీ బస్సులకు కిలోమీటర్ కు 25 పైసలు, మెట్రో ఎక్స్ ప్రెస్, ఆపై సర్వీసులకు కిలోమీటర్ కు 30పైసలు పెంచాలని ప్రపోజల్స్ రెడీ చేశారు. ఆర్టీసీపై మంత్రి పువ్వాడ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులతో చర్చించి.. ప్రతిపాదనలు ఫైనల్ చేశారు. సీఎం దగ్గరకు ఫైల్ పంపారు. సీఎం ఆమోదం పొందిన వెంటనే ఆర్టీసీ చార్జీలు పెరిగే అవకాశం ఉంది.

మరిన్ని వార్తల కోసం..

12 సెంటీమీటర్ల తోకతో పుట్టిన శిశువు

సీఎం కేసీఆర్ సభపై రైతులతో చర్చించిన పార్టీ నేతలు

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హఫీజ్ సయీద్ నిర్దోషి: పాక్ కోర్టు