70 ఏళ్ల చరిత్రలో భారీగా పెట్రో రేట్ల తగ్గింపు

70 ఏళ్ల చరిత్రలో భారీగా పెట్రో రేట్ల తగ్గింపు
  • పంజాబ్ సీఎం చరణ్‌జిత్ చన్నీ ప్రకటన

చండీగఢ్: వచ్చే ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరగునున్న పంజాబ్‌లో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు భారీ ఉపశమనం ప్రకటించింది. పెట్రోల్‌, డీజిల్ ధరలను తగ్గిస్తూ ఆ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌పై రూ.10, డీజిల్‌పై రూ.5 చొప్పున రేట్లు తగ్గించినట్లు ఆదివారం సీఎం చరణ్‌జిత్‌ సింగ్ చన్నీ తెలిపారు. ఈ స్థాయిలో తగ్గింపు గడిచిన 70 ఏండ్లలో ఎప్పుడూ జరగలేదని ఆయన చెప్పారు. తమ పరిసర రాష్ట్రాలతో పోలిస్తే పెట్రోల్ పంజాబ్‌లోనే అగ్గువ అని అన్నారు. ఢిల్లీలో పోలిస్తే పంజాబ్‌లో పెట్రోల్ రేటు తొమ్మది రూపాయలు తక్కువ అని చరణ్‌జిత్ చన్నీ తెలిపారు.

దీపావళి ముందు పండుగ కానుకగా పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్ తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 చొప్పున ధర తగ్గించింది కేంద్రం. తమ బాటలోనే రాష్ట్రాలు కూడా పెట్రో భారం తగ్గించాలని సూచించింది. దీంతో దేశవ్యాప్తంగా అన్ని ఎన్డీఏ పాలిత రాష్ట్రాలతో పాటు పలు ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా పెట్రోల్, డీజిల్‌పై తమ వంతుగా పన్నులు తగ్గించాయి. నిన్నటి వరకు దాదాపు 16 రాష్ట్రాలు పెట్రోల్‌ రేట్లు తగ్గించాయి. ఇవాళ పంజాబ్ ప్రభుత్వం పెట్రో రేట్లు తగ్గించింది. కేంద్రం పిలుపు తర్వాత పెట్రోల్‌, డీజిల్ రేట్లు తగ్గించిన తొలి కాంగ్రెస్ ప్రభుత్వమిదే.

మరిన్ని వార్తల కోసం..

ఆర్టీసీ చార్జీల పెంపుకు రంగం సిద్దం.. సీఎం కేసీఆర్‌‌ వద్దకు ఫైల్

సీఎం కేసీఆర్ సభపై రైతులతో చర్చించిన పార్టీ నేతలు

ఒకే ఫ్యామిలీలో ముగ్గురిని కాటేసిన పాము.. 3 నెలల చిన్నారి మృతి