దామెరలో ఘనంగా ఫకీర్ షా వలీ జాతర..దర్గా వద్ద ముజావర్లు గంధాన్ని పెట్టి ప్రత్యేక ప్రార్థనలు

దామెరలో ఘనంగా ఫకీర్ షా వలీ జాతర..దర్గా వద్ద ముజావర్లు గంధాన్ని పెట్టి ప్రత్యేక ప్రార్థనలు

ఎల్కతుర్తి, వెలుగు: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దామెర శివారులోని గుట్టపై ఫకీర్ షావలీ జాతరను గురువారం ఘనంగా నిర్వహించారు.  ఉమ్మడి కరీంనగర్, వరంగల్, హైదరాబాద్, మహారాష్ట్ర నుండి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఫకీర్ షా వలీ దర్గా వద్ద ముజావర్లు గంధాన్ని పెట్టి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.‌‌‌‌ 

భక్తులు గుట్ట ఎక్కి దర్గా వద్ద జెండాలు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా  ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తాగునీటి సౌకర్యం కల్పించారు. పీహెచ్సీ ఆధ్వర్యంలో ఫ్రీ హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారు. సీఐ పులి రమేష్, ఎస్సై ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. 

కాగా, ప్రతి ఏడాది ఉగాది సందర్భంగా దామెర లో  జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఈ జాతరలో కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు. జాతర సందర్భంగా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.