రేవంత్​ కేబినెట్​ లో మంత్రిగా దామోదర రాజనరసింహ

రేవంత్​ కేబినెట్​ లో మంత్రిగా దామోదర రాజనరసింహ

దామోదర రాజనరసింహ రేవంత్​ కేబినెట్ లో మంత్రి బాధ్యతలు స్వీకరించారు. ఆయన 1958 డిసెంబరు 5న జన్మించాడు. కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడైన రాజనర్సింహ  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో  ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇంజనీరింగ్ విద్య అభ్యసించి, రాజకీయాలలో ప్రవేశించి 1989లో తొలిసారిగా ఆందోల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొంది, ఆ తర్వాత మరో రెండుసార్లు కూడా ఇదే స్థానం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు

1989లో తొలిసారి మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి విజయం సాధించారు. 2004లో రెండోసారి అదే నియోజకవర్గం నుంచి గెలుపొంది, 2006లో వైఎస్సార్ మంత్రివర్గంలో ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా నియమితులైనారు. 2009లో కూడా మూడవసారి ఆందోల్ నుంచి విజయం సాధించి వైఎస్సార్, కొణిజేటి రోశయ్య మంత్రివర్గాలలో స్థానం పొంది, 2010 డిసెంబరులో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో కూడా చోటుపొందారు.ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో తెలంగాణ ప్రాంతానికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వవలసి రావడంతో 2011, జూన్ 10న దామోదర రాజనర్సింహకు ఉప ముఖ్యమంత్రి పదవి లభించింది. ఆయన 2023 ఆగస్ట్ 20న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శాశ్వత ఆహ్వానిత సభ్యుడిగా నియమితుడయ్యాడు. దామోదర రాజనర్సింహ 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆందోల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి..  2023 డిసెంబర్ 07న రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు.