సీఎం రేవంత్‌రెడ్డితో దానం నాగేందర్ భేటీ

సీఎం రేవంత్‌రెడ్డితో  దానం నాగేందర్ భేటీ

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ భేటీ అయ్యారు. కాగా ఈ సమావేశంలో ఏఐసీసీ ఇన్‌ఛార్జి దీపా దాస్ మున్షీ, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఈ క్రమంలో  ఎమ్మెల్యే దానం కాంగ్రెస్ పార్టీలో  చేరతారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాను సీఎంను మర్యాదపూర్వకంగా  కలిసినాని దానం నాగేందర్ అంటున్నారు  ఖైరతాబాద్ నుంచి ప్రస్తుతం దానం ఎమ్మెల్యేగా ఉన్నారు.  

దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు.  1994, 1999, 2004 ఎన్నిలకల్లో ఆసిఫ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్నారు. కొణిజేటి రోశయ్య మంత్రివర్గంలో అదే పోర్ట్‌ఫోలియోలో కొనసాగారు.  

2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ తరపున ఖైరతాబాద్ నుండి పోటీచేసి  చింతల రామచంద్ర రెడ్డిపై ఓడిపోయాడు. 2018లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ చేరారు. 2018లో జరిగిన ఎన్నికల్లో ఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గం నుంచి చింతల రామచంద్ర రెడ్డిపై గెలుపొందారు.