జూబ్లీహిల్స్లో నేను పోటీ చేయట్లే: దానం

జూబ్లీహిల్స్లో నేను పోటీ చేయట్లే: దానం

బషీర్​బాగ్, వెలుగు: ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలవడం చాలా ముఖ్యమని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. హైకమాండ్ సరైన అభ్యర్థిని ఎంపిక చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎవరికి టికెట్ కేటాయించినా పార్టీ గెలుపునకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. 

హైదరాబాద్ ఆదర్శ్ నగర్ లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కు సంబంధించి 92 మంది లబ్ధిదారులకు, 20 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను గురువారం ఆయనఅందజేశారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై స్పందించారు. తాను జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేస్తున్నట్లు వస్తున్న వార్తలు ఊహాగానాలే అని కొట్టిపారేశారు. జూబ్లీహిల్స్ లో గెలిచేది కాంగ్రెస్ పార్టీనే అని ధీమా వ్యక్తం చేశారు.