పార్టీ ఫిరాయింపుపై నాకు నోటీసులు రాలే : ఎమ్మెల్యే దానం నాగేందర్

పార్టీ ఫిరాయింపుపై  నాకు నోటీసులు రాలే : ఎమ్మెల్యే దానం నాగేందర్
  • ఎమ్మెల్యే దానం నాగేందర్ వెల్లడి

బషీర్​బాగ్, వెలుగు: ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై అసెంబ్లీ స్పీకర్ నుంచి తనకు ఇంకా నోటీసులు రాలేదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. హిమాయత్ నగర్ డివిజన్ లో శనివారం పలు అభివృద్ధి పనులకు ఆయన ప్రారభోత్సవాలు చేశారు. దానం మాట్లాడుతూ.. స్పీకర్ నుంచి నోటీసులు వచ్చిన ఎమ్మెల్యేలు దానికి తగ్గట్టు రిప్లై ఇస్తున్నారని తెలిపారు. తనకు నోటీసులు వచ్చాక లీగల్ ఒపీనియన్ తీసుకొని సమాధానం ఇస్తానన్నారు.ప్రస్తుతానికి తాను కాంగ్రెస్ లోనే ఉన్నానని స్పష్టం చేశారు.