హైకోర్టు నోటీసులు ఇంకా అందలేదు : ఎమ్మెల్యే దానం నాగేందర్

హైకోర్టు నోటీసులు ఇంకా అందలేదు : ఎమ్మెల్యే దానం నాగేందర్
  •     ఎమ్మెల్యే దానం నాగేందర్

బషీర్​బాగ్, వెలుగు: స్పీకర్ నిర్ణయాన్ని వ్యతిరేకించొద్దని పార్లమెంట్​లో కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటించారని, ఆ విషయం రాష్ట్ర బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డికి తెలియదా..? ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రశ్నించారు. ఇటీవల దానం అనర్హత కేసులో స్పీకర్ క్లిన్ చిట్ ఇవ్వడంతో మహేశ్వర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ ఫిటిషన్‌‌పై ఎమ్మెల్యే దానంకు, స్పీకర్ కమ్ ట్రిబ్యునల్ కు హైకోర్టు జారీ చేసిన నోటీసులపై ఆయన స్పందించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒక్కటే అనే విషయం ఈ ఫిటిషన్ తో తేలిపోయిందన్నారు. 

తనకు హైకోర్టు నుంచి నోటీసులు ఇంకా అందలేదని, వచ్చాక అడ్వకేట్ తో సంప్రదించి సమాధానం ఇస్తానని తెలిపారు. హైదరాబాద్ ఆదర్శ్ నగర్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మంగళవారం లబ్ధిదారులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ , కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను దానం అందజేసిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.