
పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు డాన్స్ టాలెంట్ చూపించేందుకు డాన్స్ రియాలిటీ షోలు ఒక ప్లాట్‌ఫామ్‌లా పనికొస్తాయి. అందుకనే డాన్స్ రియాలిటీ షోలకు క్రేజ్ ఎక్కువ. ఈసారి తెలుగు ఆడియెన్స్‌ని ఎంటర్టైన్ చేసేందుకు ‘డాన్స్ ఇండియా డాన్స్ తెలుగు’ రియాలిటీ షో వస్తోంది. ఆగస్టు 21వ తేదీ ఆదివారం ఈ షో మొదలుకానుంది.
టీవీ నటుడు అకుల్ బాలాజీ, బాస్ 3 సీజన్ కంటెస్టెంట్ రోహిణి నోని దీనికి హోస్ట్‌లు. కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్, ఒకప్పటి హీరోయిన్ సంగీత, నటి ఆనంది జడ్జిలు. ఈ షోకి సంబంధించిన టీజర్, మేకింగ్ వీడియో కూడా రిలీజ్ చేసింది జీ తెలుగు. అందులో హోస్ట్ బాలాజీతో పాటు జడ్జిలు డాన్స్ గురించి పాట పాడుతూ కంటెస్టెంట్స్‌తో కలిసి స్టెప్పులు వేశారు. ఈ షో జీ తెలుగులో ప్రతి ఆదివారం రాత్రి 9 గంటలకు టెలికాస్ట్ అవుతుంది.