ఆరేపల్లి రోడ్డుపై పొంచి ఉన్న ప్రమాదం

ఆరేపల్లి రోడ్డుపై పొంచి ఉన్న ప్రమాదం

కామారెడ్డి​, వెలుగు: భిక్కనూరు మండల కేంద్రం నుంచి రాజంపేట మండల కేంద్రం వరకు డబుల్ లైన్ బీటీ రోడ్డు నిర్మించారు. రాజంపేట మండలం ఆరేపల్లి నుంచి ఆరేపల్లి తండా మధ్య కుంట ఉంది. దాని కట్టపై నుంచే ఈ రోడ్డు ఉంది. కుంట వైపు రోడ్డుపై రెయిలింగ్ నిర్మించలేదు. కనీస రక్షణ చర్యలు లేవు. ఈ దారిలో వెళ్లే వాహనదారులు ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా వాహనాలు కుంటలో పడిపోయే ప్రమాదం ఉంది. ఆర్​అండ్​బీ అధికారులు స్పందించి, కుంట కట్టపై రక్షణ చర్యలు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.