ఆలుగడ్డలకు మొలకలొస్తే డేంజర్

ఆలుగడ్డలకు మొలకలొస్తే డేంజర్

కూరగాయల్లో ఆలుగడ్డలను స్పెషల్​గా స్టోర్​ చేయాల్సిన పని లేదు. కాకపోతే ఎక్కువ రోజులు వాడకుండా ఉంటే. వాటిపై మొలకలు వస్తుంటాయి. చాలామంది వాటిని తీసేసి వండుతారు కూడా. అయితే మొలకలు వచ్చిన ఆలుగడ్డలను వండుకోవద్దని చెప్తోంది అమెరికాకు చెందిన నేషనల్​ క్యాపిటల్​ పాయిజన్​ సెంటర్​ అనే సంస్థ. సాధారణంగా ఆలుగడ్డలను తక్కువ మోతాదులో తీసుకుంటే, అందులోని సొలానైన్​, చాకోనైన్ అనే పదార్థాలు ​బ్లడ్​ షుగర్​ లెవల్స్​, కొలెస్ట్రాల్​ని కంట్రోల్​లో ఉంచుతాయి. లేదంటే అవే పదార్థాలు బాడీలో ఎక్కువై విషంగా మారతాయి. అయితే మొలకెత్తిన ఆలుగడ్డల్లో ఈ సొలానైన్​, చాకోనైన్​ పదార్థాలు ఎక్కువ శాతం ఉంటాయి. దానివల్ల తలనొప్పి, లో బీపీ, జ్వరం వంటి సమస్యలకు ఈ మొలకెత్తిన ఆలుగడ్డలు కారణమవుతాయి.