
నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే పాటకు ఇదిగో ఈ ఆసుపత్రి సరిగ్గా సరిపోతుంది. ఒక రోగాన్ని తగ్గించుకోడానికి వస్తే ఇంకో పది రోగాలు అంటుకునేలా ఉన్నాయి ఇక్కడి పరిస్థితులు. ఒకటి కాదు రెండు కదా ఏకంగా ఎలుకల గుంపుతోనే ఆసుపత్రి నిండిపోయింది అనుకోండి... ఏకంగా ఐసీయూలోనే ఎలుకలు స్వేచ్ఛగా విహారం చేస్తున్నాయంటే అర్థం చేసుకోవచ్చు.
यूपी के रामपुर के जिला अस्पताल में मरीजों के ऊपर दौड़ते चूहें. अद्भुत व्यवस्था है. pic.twitter.com/UrGWehsdox
— Priya singh (@priyarajputlive) December 25, 2023
ఉత్తరప్రదేశ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రులలో పరిశుభ్రత పరిస్థితిపై అనేక భయంకరమైన వీడియోలు ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తున్నాయి. బెడ్ పై పడుకున్న రోగులపై ఎలుకలు పరుగులు తీయడం వంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకు ఈ ఘటనలు ఆందోళనకరంగా మారాయి. అంతేకాకుండా ఆసుపత్రుల ఫ్లోర్‌లపై కూడా ఒకదాని వెంట మరోకటి పరుగులు తీస్తున్నాయి.
#Aligarh-स्वच्छ भारत मिशन में चार चांद लगाते चूहें,वीडियो जिला सरकारी अस्पताल मलखान सिंह की है जो अस्पताल की बदहाली की सूरत है बयां कर रही हैं, @CmoAligarh @Dm_Aligarh @myogiadityanath @brajeshpathakup @AmitShah @BJP4UP @SAMACHARPLUS pic.twitter.com/CSK6QSJJsr
— Vishu Raghav ( Tv journalist ) (@Vishuraghav9) December 26, 2023
ఆసుపత్రిలో ఎలుకల బెడద ఎక్కువగా ఉండడంతో రోగులకు మరిన్ని ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం లేకపోలేదు. ఈ ఎలుకల బెడద రోగులతో పాటు అక్కడ పనిచేసే సిబ్బందికి కూడా చాలా ప్రమాదకరం. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. మరోపక్క దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమని మండిపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి ఘటనలపై జోక్యం చేసుకుని ఆసుపత్రుల్లో తలెత్తకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.