
బెంగళూరు: నార్త్ ఈస్ట్ జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లో సెంట్రల్ జోన్ భారీ స్కోరు చేసింది. డానిష్ మాలేవర్ (203) డబుల్ సెంచరీకి తోడు రజత్ పటీదార్ (125) చెలరేగడంతో.. 432/2 ఓవర్‌నైట్ స్కోరుతో శుక్రవారం రెండో రోజు ఆట కొనసాగించిన సెంట్రల్ తొలి ఇన్నింగ్స్‌ను 102 ఓవర్లలో 532/4 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. యష్ రాథోడ్ (87 నాటౌట్), శుభమ్ శర్మ (34) ఫర్వాలేదనిపించారు. ఆకాశ్ చౌదరీ రెండు వికెట్లు పడగొట్టాడు.
తర్వాత బ్యాటింగ్‌కు దిగిన నార్త్ ఈస్ట్ జోన్ ఆట ముగిసే టైమ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 65 ఓవర్లలో 168/7 స్కోరు చేసింది. అంకూర్ మాలిక్ (31 బ్యాటింగ్), పాల్జోర్ తమాంగ్ (3 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. నార్త్ ఈస్ట్ ఇంకా 364 రన్స్ వెనకబడి ఉంది. కర్నాజిత్ (48), ఆశిష్ తాపా (35) మెరుగ్గా ఆడారు. టెచి డొరియా (20), జెహు అండర్సన్ (17), రాంగ్సెన్ జొనాథన్ (4), హెమ్ ఛెత్రి (2), జొటిన్ (0) నిరాశపర్చారు. ఆదిత్య థాక్రే 3, హర్ష్ దూబే రెండు వికెట్లు తీశారు.