జ్యోతిష్యం: ధనత్రయోదశి.. ఈ నాలుగు రాశులకు అదృష్టాన్ని మోసుకొచ్చింది..

జ్యోతిష్యం:  ధనత్రయోదశి.. ఈ నాలుగు రాశులకు అదృష్టాన్ని మోసుకొచ్చింది..

 దీపావళి పండుగ జరుపుకొనేందుకు జనాలు సిద్దమవుతున్నారు.  ఈ ఏడాది అక్టోబర్​  20 న దీపావళి పండుగను జరుపుకుంటారు.  ఆరోజుకు రెండు రోజుల ముందు అంటే అక్టోబర్​ 18 న  దంతేరాస్​ పండుగను జరుపుకుంటారు.  పండితులు తెలిపిన వివరాలు ప్రకారం ఆశ్వయుజమాసం కృష్ణ పక్షం త్రయోదశి రోజున .. ధన త్రయోదశి పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఆ రోజున ( అక్టోబర్​ 18)  సందపకు అధిపతి అయిన కుబేరుడిని భక్తి తో పూజిస్తారు. ఆరోజు ఎంతో కొంత  బంగారం కూడా కొంటూ ఉంటారు. శుభాలను మోసుకువచ్చే ధనత్రయోదశి వేళ నాలుగు రాశులకు అపారమైన అదృష్టం కలుగుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. . ఇప్పుడు ఆ రాసుల గురించి తెలుసుకుందాం. . ....

మేష రాశి... ధన త్రయోదశి రోజున  ఈ రాశి వారికి అధికంగా లాభాలు కలుగుతాయి.  ఆ రోజు ఏపని చేపట్టిన సునాయాశంగా పూర్తవుతుంది.  కొత్త ఆదాయ మార్గాలు కలసి వస్తాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. వ్యాపారస్తులకు గతంతో పోలిస్తే ఆర్దిక పరిస్థితి మెరుగుపడుతుంది. జాబ్​ మారాలనుకునే మంచి సమయం.  జీతం పెరగడం, ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. 

కన్య రాశి: ధనత్రయోదశి రోజున ఈ రాశికి అనుకూల ఫలితాలుంటాయి. వ్యాపారస్తులు అధికంగా లాభాలు పొందుతారు. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంశలు అందుకుంటారు. కొన్ని శుభవార్తలు వింటారు.  పూర్వీకుల ఆస్తి కలసి వస్తుంది.శుభవార్తలు వింటారు.  మానసిక ఆనందం పెరుగుతుంది.

తుల రాశి: ఈ రాశివారికి ఈ ఏడాది ధనత్రయోదశి అదృష్టం వరిస్తుందని పండితులు చెబుతున్నారు.  ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పనులు పూర్తవుతాయి.  ఉద్యోగస్థులు ఉన్నత స్థానాన్ని సాధిస్తారు. వ్యాపారం చేసే వారికి కూడా ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఎందులో పెట్టుబడులు పెట్టినా.. లాభాలు వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులకు జాబ్​ ఆఫర్లు వస్తాయి.  ప్రేమ .. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి. 

ధనుస్సు రాశి:  ఈ రాశి వారికి ధనత్రయోదశి రోజు చాలా అనుకూలంగా ఉంది. గతంలో పెట్టిన పెట్టుబడులకు లాభాలు వస్తాయి. ఉద్యోగస్తులు చాలా ఆనందంగా గడుపుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది, వ్యాపారస్తులకు గణనీయమైన లాభాలు వస్తాయి.  నిరుద్యోగులకు ఆశించిన జాబ్​ వస్తుంది.  ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనంలోని సమాచారాన్ని  జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించేదు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.