
యాక్సిడెంట్ కారణంగా కొంత గ్యాప్ తీసుకున్న నభా నటేష్.. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొస్తోంది. వాటిలో ఒకటి ప్రియదర్శికి జంటగా ఆమె నటించిన చిత్రం ‘డార్లింగ్’. అశ్విన్ రామ్ దర్శకత్వంలో కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మించిన ఈ సినిమా జులై 19న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నభా నటేష్ చెప్పిన విశేషాలు.
దాదాపు రెండేళ్ల తర్వాత నేను నటించిన సినిమా థియేటర్స్‌కు వస్తోంది. దీంతో ప్రేక్షకులు నన్ను చూడటానికి ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారని భావిస్తున్నా. -ఆడియెన్స్‌కి నా ఎనర్జీ ఇష్టం. అశ్విన్ చెప్పిన -స్క్రిప్ట్ చాలా నచ్చింది. నా క్యారెక్టర్ ఇంకా నచ్చింది. నాది చాలా చాలెంజింగ్ రోల్. స్ప్లిట్ పర్సనాలిటీ ఉన్న ఈ పాత్రని పెర్ఫార్మ్ చేయడం చాలెంజింగ్‌గా అనిపించింది.
నాకిది డ్రీమ్ రోల్ లాంటిది. మంచి కథ కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఇలాంటి స్ర్కిప్ట్ రావడం హ్యాపీ. ఫన్, లవ్, ఫ్యామిలీ డ్రామా, థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఉన్న కంప్లీట్ ఎంటర్‌టైనర్ ఇది. ప్రియదర్శితో కలిసి వర్క్ చేయడం చాలా బాగుంది. మాఇద్దరి మధ్య నడిచే కథ. నా యాక్షన్‌కి ఆయన రియాక్షన్ చాలా ఇంపార్టెంట్. తన కామెడీ టైమింగ్ నేచురల్‌గా ఉంటుంది.
ఇందులో వివేక్ సాగర్ అందించిన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. నా కెరీర్‌లో ఫస్ట్ టైం సోలో ట్రాక్ చేసే చాన్స్ వచ్చింది. ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్‌తో వర్క్ చేయడం ఆనందంగా ఉంది. వాళ్లు స్ర్కిప్ట్‌పై నమ్మకం పెడతారు. సినిమా విజయంపై టీమ్ అంతా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. ఇక ప్రస్తుతం నిఖిల్‌తో -‘స్వయంభూ’ చిత్రంలో నటిస్తున్నాం. మరో రెండు సినిమాలు లైనప్‌లో ఉన్నాయి’’.