రూ.344 కోట్లు సేకరించిన డార్విన్‌‌‌‌బాక్స్‌‌‌‌

రూ.344 కోట్లు సేకరించిన డార్విన్‌‌‌‌బాక్స్‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: హైదరాబాద్‌‌‌‌కు చెందిన హెచ్‌‌‌‌ఆర్  టెక్  ప్లాట్‌‌‌‌ఫామ్ డార్విన్‌‌‌‌బాక్స్, ఒంటారియో టీచర్స్ పెన్షన్ ప్లాన్‌‌‌‌కు చెందిన టీచర్స్ వెంచర్ గ్రోత్ (టీవీజీ) నుంచి 40 మిలియన్ డాలర్ల (సుమారు రూ.344 కోట్ల) ను  సమీకరించింది.  ఏఐ -ఆధారిత, గ్లోబల్ డిజైన్‌‌‌‌తో క్లయింట్ల ‌‌‌‌ ఎక్స్‌‌‌‌పీరియెన్స్‌‌‌‌ను  మెరుగుపరుస్తామని కంపెనీ  ఫౌండర్‌‌‌‌‌‌‌‌ జయంత్ పాలేటి అన్నారు. ఈ నిధులతో డార్విన్‌‌‌‌బాక్స్ సేకరించిన మొత్తం ఫండ్స్‌‌‌‌ 320 మిలియన్ డాలర్లకు చేరాయి. 

కంపెనీ  2022లో  ఉత్తర అమెరికాలో ఎంటర్ అయ్యింది. ఇక్కడ బిజినెస్‌‌‌‌ను మరింతగా విస్తరించడానికి తాజాగా సేకరించిన ఫండ్స్‌‌‌‌ను వాడతామని  చెబుతోంది. డార్విన్‌‌‌‌బాక్స్‌‌‌‌ క్లయింట్లలో వీవర్క్, జారా, అడిడాస్, స్టార్‌‌‌‌బక్స్ ఉన్నాయి. టీవీజీతో పాటు మైక్రోసాఫ్ట్, సేల్స్‌‌‌‌ఫోర్స్, పీక్ ఎక్స్‌‌‌‌వీ, లైట్‌‌‌‌స్పీడ్, టీసీవీ వంటి ప్రముఖ ఇన్వెస్టర్లు డార్విన్‌‌‌‌ బాక్స్‌‌‌‌లో పెట్టుబడులు పెట్టారు. ఈ కంపెనీ ఈ ఏడాది మార్చిలో 140 మిలియన్ డాలర్లను సేకరించింది.