MLC 2025: డుప్లెసిస్ కెప్టెన్సీ అదుర్స్: చివరి ఓవర్లో 9 పరుగులు.. పార్ట్ టైం బౌలర్ మ్యాజిక్

MLC 2025: డుప్లెసిస్ కెప్టెన్సీ అదుర్స్: చివరి ఓవర్లో 9 పరుగులు.. పార్ట్ టైం బౌలర్ మ్యాజిక్

గెలవాలంటే చివరి ఓవర్లో 9 పరుగులు చేయాలి. ఈ సమయంలో క్రీజ్ లో ఉన్న బ్యాటర్ కంటే కూడా బౌలర్ పైనే ఎక్కువగా ఒత్తిడి ఉంటుంది. విజయానికి చివరి ఓవర్లో 15 పరుగులు ఉన్నప్పటికీ స్టార్ బౌలర్లను సైతం నమ్మలేని పరిస్థితి. అయితే ఫాఫ్ డుప్లెసిస్ మాత్రమే ఒక పార్ట్ టైం బౌలర్ కు బంతి అప్పగించి తమ జట్టుకు విజయాన్ని అందించాడు. మేజర్ లీగ్ క్రికెట్ లో శనివారం (జూన్ 14) ముంబై ఇండియన్స్ న్యూయార్క్, టెక్సాస్ సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ లో ఈ సూపర్ చివరి ఓవర్ డ్రామా చోటు చేసుకుంది. 

187 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ఎంఐ న్యూయార్క్.. చివరి ఓవర్లో 9 పరుగులు చేస్తే విజయం సాధిస్తుంది. ఈ దశలో చివరి ఓవర్ వేయడానికి లెగ్ బ్రేక్ స్పిన్నర్ మొహమ్మద్ మొహ్సిన్ సిద్ధంగా ఉన్నాడు. అయితే డుప్లెసిస్ మాత్రం చివరి ఓవర్ న్యూజిలాండ్ పార్ట్ టైం బౌలర్ డారిల్ మిచెల్ చేతికి ఇచ్చాడు. అప్పటికే మూడు ఓవర్లలో 50 పరుగులిచ్చి భారీగా పరుగులిచ్చిన మిచెల్ కు బౌలింగ్ ఇవ్వడంతో సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. మిచెల్ కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టాడు. వేరియేషన్స్ చూపిస్తూ ఆరు చక్కని బంతులను వేశాడు.   

►ALSO READ | MLC 2025: ఫాఫ్‌కు ఇలాంటివి మామూలే: 40 ఏళ్ళ వయసులో ఫుల్ లెంగ్త్ డైవ్ చేస్తూ కళ్లుచెదిరే క్యాచ్

9 పరుగులు కావాల్సిన దశలో కేవలం 5 పరుగులే ఇచ్చి మ్యాచ్ ను గెలిపించాడు. నాలుగో బంతికి పరుగులేమీ రాకపోగా.. మిగిలిన ఐదు బంతుల్లో 5 సింగిల్స్ వచ్చాయి. లోయర్ ఆర్డర్ బ్యాటర్లు నవీన్ ఉల్ హక్, థిల్లాన్ ఉండడం వలన పరుగులు రాలేదు. దీంతో టెక్సాస్ సూపర్ కింగ్స్ 3 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన టెక్సాస్ సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఎంఐ న్యూయార్క్ 8 వికెట్ల నష్టానికి 182 పరుగులకే పరిమితమై 3 పరుగుల తేడాతో ఓడిపోయింది.