
పద్మారావునగర్, వెలుగు: తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం -యూఎస్ఏ ఆధ్వర్యంలో కాలిఫోర్నియాలోని డబ్లిన్ నగరంలో బతుకమ్మ, దసరా పండుగ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. వెయ్యి మంది తెలంగాణ ఎన్నారైలు బతుకమ్మ ఆడారు.
టీడీఎఫ్ ఇండియా అధ్యక్షుడు మట్టా రాజేశ్వర్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు రాజారెడ్డి వట్టే, నిర్వాహకులు కీర్తి మణికొండ, సరిత రాజిడి, వందన, సరిత కేతిరెడ్డి పాల్గొన్నారు.