
హిందువులు అత్యంత వైభవంగా జరుపుకొనే పండుగల్లో దసరా పండుగ . ఆశ్వయుజ మాసం దశమి రోజున దసరా పండుగ రోజు ఆయుధ పూజ నిర్వహిస్తారు, ఈ ఏడాది ( 2025) అక్టోబర్ 2వ తేదీ గురువారం దేశవ్యాప్తంగా గొప్ప వైభవంగా జరుపుకోవడడానికి రెడీ అవుతున్నారు. ఆయుధ పూజ, రావణ దహనానికి అనుకూలమైన సమయం, ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.
దసరా (విజయదశమి) తేదీ.. శుభ సమయం
- దశమి తిథి ప్రారంభం: అక్టోబర్ 1 సాయంత్రం 7:01 గంటలకు
- దశమి తిథి ముగింపు : అక్టోబర్ 2రాత్రి 7:10 గంటలకు.. ఉదయం తిథి ప్రకారం దసరా వేడుకలు అక్టోబర్ 2వ తేదీన జరుపుకుంటారు.
- ఆయుధ పూజ: అక్టోబర్ 2 మధ్యాహ్నం 2:09 నుంచి 2:56 వరకు (వ్యవధి: 47 నిమిషాలు)
- మధ్యాహ్నం పూజ సమయం: అక్టోబర్ 2 మధ్యాహ్నం 1:21 నుంచి 3:44 వరకు
- రావణ దహనానికి శుభ సమయం: అక్టోబర్ 2 సూర్యాస్తమయం తరువాత సాయంత్రం 6:05 గంటల ప్రాంతంలో (ప్రదోష కాలం)
ఆయుధ పూజ చేసే విధానం
పురాతన కాలంలో రాజులు , యోధులు ఆశ్వయుజమాసం దశమి రోజున విజయాన్ని కోరుతూ ఆయుధాలను పూజించేవారు. ఈ సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది.. ప్రజలు శక్తి , జ్ఞానం పట్ల గౌరవాన్ని వ్యక్తపరచడానికి తమ ఆయుధాలను (సామగ్రి, పనిముట్లు, వాహనాలు, పుస్తకాలు మొదలైనవి) పూజిస్తారు.
విజయదశమి నాడు విజయ ముహూర్తంలో ఆయుధ పూజ చేయడం వలన శుభ ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. ఈ ముహూర్తంలో పూజ చేయడం జీవితంలోని అడ్డంకులను అధిగమించడంలో సహాయపడుతుంది.
- పూజ చేసే ప్రదేశాన్ని... గోమయంతో శుద్ది చేయాలి. ఆ ప్రాంతంలో ముగ్గులు వేయాలి. ఒక ఆనసంపై కొత్త తువాలు గాని.. జాకెట్ పీస్ గాని ఉంచి కొంచెం బియ్యం పోసి అమ్మవారి చిత్రపటాన్ని ఉంచాలి. అమ్మవారికి చిత్రపటానికి ఎదురుగా పూజించాల్సిన ఆయుధాలు .. పనిముట్లను ఉంచాలి.
- అమ్మవారి చిత్రపటం ఎదురుగా ఎర్రని వస్త్రాన్ని ఉంచి దానిపూ పూజ చేయాల్సిన అన్ని ఆయుధాలు, పరికరాలను ఉంచండి.
- ఆయుధాలపై గంగా జలాన్ని చల్లండి. అందు బాటులో లేకపోతే నదుల నుంచి తీసుకొచ్చిన నీళ్లు గాని.. అదీలేకపోతే పసుపునీళ్లు చల్లండి
- ఆయుధాలను పసుపు.. కుంకుమ.. గంధం .. పూలతో అలంకరించండి.. అమ్మవారి చిత్రపటానికి.. ఆయుధాలకు పూలమాల సమర్పించండి.
- ఆయుధాల ఎదుట ఆవునెయ్యితో దీపం వెలిగించండి. జమ్మి ఆకులు.. అక్షింతలతో పూజ చేయండి. అక్షతలను సమర్పించండి. స్వీట్లను నైవేద్యంగా సమర్పించండి.
- పూజ సమయంలో ... ఓం జయంతీ మంగళ కాళీ భద్రకాళీ కపాలినీ దుర్గా క్షమా శివ ధాత్రీ స్వాహా స్వధా నమోస్తుతే అనే మంత్రాన్ని చదవండి.
దసరా నవరాత్రి ఉత్సవాలు విజయదశమి పండుగతో ముగుస్తాయి. దసరా పండుగ రోజు అంటే ఈ ఏడాది అక్టబర్ 2 వ తేదీన ఆయుధ పూజ నిర్వహిస్తారు. విజయదశమి పండుగను చెడుపై మంచి విజయం సాధించినందుకు జరుపుకుంటారు. పురాణాల్లో దసరా పండుగ గురించి చాలా కథలున్నాయి. విజయదశమి రోజునే శ్రీరాముడు రావణుడిని సంహరించి లంకను జయించాడని .. కనుక ఈ రోజు ధైర్యం, శౌర్యం, విజయానికి ప్రతీకగా దసరా వేడుకలను జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో రావణ దహనం కూడా నిర్వహిస్తారు.
శారదీయ నవరాత్రులలో తొమ్మిది రోజులు దుర్గాదేవిని పూజించిన తర్వాత పదవ రోజున విజయదశమిగా జరుపుకుంటారు. ఈ రోజున దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించి, ప్రపంచాన్ని రాక్షస బాధలనుంచి విడిపించిందని నమ్ముతారు. అందువల్ల ఈ రోజును అమ్మవారి విజయ రూపాన్ని పూజించే రోజుగా కూడా పరిగణిస్తారు.