
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని గ్రహాల మార్పుతో జనాల వ్యక్తిగత జీవితంపై ప్రభావం పడుతుంది. గ్రహాలు కొన్ని సందర్భాల్లో తమ స్థితిని మార్చుకుంటూ ఉంటాయి. 62 ఏళ్ల తరువాత దసరా పండుగ రోజు అంటే అక్టోబర్ 2న బుధ గ్రహం, గురు గ్రహం, శుక్ర గ్రహాలు తెల్లవారు జామున 3.32 గంటలకు కలవడంతో నవ పంచమి రాజ యోగంఏర్పడనుంది. దీంతో కొన్ని రాశుల్లో మార్పులు తెచ్చింది అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. దీని వలన ఆరు రాశుల వారు అదృష్టవంతులు కానున్నారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఇప్పుడు ఆ రాశుల ( సింహ, కన్య,వృశ్చికం, ధనస్సు, మకర, మీనం) గురించి తెలుసుకుందాం. . .!
సాధారణంగా నవ పంచమి రాజయోగం ఏర్పడితే కొన్ని రాశులపై ప్రత్యక్షంగా ప్రభావం పడి ఆ రాశులు కలిగిన వారి జీవితాల్లో ఊహించని మార్పులు ఉంటాయి. గతంలో పడిన కష్టాల నుంచి బయటపడతారు. కొత్తగా ఏ పని మొదలుపెట్టిన సక్సెస్ సాధిస్తారు.
సింహ రాశి : ఈ రాశి వారికి నవ పంచమి యోగం అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది . గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి అధిక లాభాలు పొందుతారు. ఉద్యోగులు అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. వీరికి సీనియర్ల మద్దతు ఉండడం వల్ల కొన్ని ప్రాజెక్టులను ఈజీగా పూర్తి చేయగలుగుతారు. విదేశాల్లో ఉండేవారి నుంచి శుభవార్తలు వింటారు.
కన్యా రాశి: ఈ రాశి వారికి నవపంచమ రాజయోగం వల్ల జీవితంలో సానుకూల ఫలితాలు వస్తాయి. కొంతమందికి శుభవార్తలు అందుతాయి. పనిలో ఉన్నత అధికారులు మీ పనితీరును అభినందిస్తారు. కొంతమందికి కొత్త బాధ్యతలు అప్పగించవచ్చు. వ్యాపారవేత్తలకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఊహించని ఆర్థిక లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఎలాంటి ఇబ్బందులు ఉండవని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
వృశ్చిక రాశి : ఈ రాశివారికి నవ పంచమ రాజయోగం వలన గతంలో చేపట్టిన పనుల్లో ఏర్పడిన ఆటంకాలు తొలగిపోతాయి. పూర్వీకుల ఆస్తి కలసి రావడంతో రుణ బాధలు తీరి ఆనందంగా గడుపుతారు. ఆర్థికంగా బాగుటుంది. కొత్త ఆదాయ మార్గాల ద్వారా ఆదాయం చేతి కందుతుంది. ఉద్యోగస్తులకు అనుకోకుండా ప్రమోషన్ రావడం.. వేతనం పెరుగుతుంది. విదేశాల్లో ఉద్యోగం కోసం ఎదురు చూసే వారు గుడ్ న్యూస్ వింటారు. వ్యాపారస్తులు వారి వ్యాపారాన్ని విస్తరించే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
ధనస్సు రాశి : నవ పంచమ రాజయోగం ( బుధుడు, గురుడు, శుక్రుడు కలయిక) వలన ఈ రాశి వారికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ఏ పని చేపట్టినా ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా సాగిపోతుంది. శత్రువులు కూడా మిత్రులుగా మారతారడంతో ... పట్టిందల్లా బంగారమే కానుంది. విదేశీ ప్రయాణాలు చేయాలి అని కలలు కనే వారి కోరిక తీరనుంది. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పూర్వీకుల ఆస్తి కలసి వస్తుంది. ఆర్దిక ఇబ్బందులకు పరిష్కారం లభిస్తుంది.
మకర రాశి : ఈ రాశి వారికి వారికి నవపంచమ రాజయోగం వలన మంచి లాభాలు వస్తాయి. జీవితంలో సమస్యలు పరిష్కారమవుతాయి. జీవితంలో ఆనందం పెరుగుతుంది. ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది. సంపదలో మంచి పెరుగుదల ఉంటుంది. వ్యాపారులకు మంచి పురోగతి, లాభం లభిస్తుంది. కొత్త బ్రాంచిలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడే అవకాశం ఉంది. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది.
మీన రాశి : ఈ రాశి వారికి నవ పంచమ రాజయోగం వలన ఆర్థికంగా కలిసి వస్తుంది. వృత్తిపరంగా అద్భుతమైన ప్రయోజనాలు అందుకుంటారు. ఇప్పటివరకు పడుతున్న ఇబ్బందులు.. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఇంటాబయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగస్తులకు అనుకోకుండా కావలసిన ప్రదేశానికి బదిలీ అవుతారు. వ్యాపారస్తుకు అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది.