Dasara 2025 : నవరాత్రుల్లో రోజూ తులసి పూజ చేయండి.. మీరు అనుకున్న పనులు ఇట్టే అయిపోతాయి..!

Dasara 2025 : నవరాత్రుల్లో రోజూ తులసి పూజ చేయండి.. మీరు అనుకున్న పనులు ఇట్టే అయిపోతాయి..!

ఆశ్వయుజమాసం మొదలైంది.  ఓ పక్క బతుకమ్మ సెలబ్రేషన్స్​.. మరో పక్క దసరా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనపాగుతున్నాయి.  నారీమణులు బతుకమ్మ ఆట పాట తో సందడి చేస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో తులసి మాతను పూజిస్తే ఐశ్వర్యం.. సంపదతో పాటు  అనుకున్న పనులు ఇట్టే అయిపోతాయని పండితులు చెబుతున్నారు.  తులసి మాతను ఎలా పూజించాలి..నైవేద్యం ఇతర వివరాలను తెలుసుకుందాం. .  .

 దేశ వ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాల్లో  దుర్గాదేవిని ఒక్కో రోజు ఒక్కో అవతారంలో పూజలు చేస్తున్నారు.  నవరాత్రులలో కొన్ని పరిహారాలను పాటించడం వలన  ఆర్థికంగా ఉన్న ఇబ్బందులు తొలి.. ఆర్థిక లాభంతో పాటు  ఎంతో కాలంగా  కాని పనులు ఇట్టే అయి చాలా శుభ ఫలితాలు కలుగుతాయని పండితులుచెబుతున్నారు. 

దసరా  నవరాత్రి ఉత్సవాల్లో  దుర్గాదేవిని పూస్తారు . ఈ  ఉత్సవాల్లో  దుర్గాదేవి  తొమ్మిది విభిన్న రూపాలను పూజిస్తారు. దసరా పండుగ రోజు తులసీ మాతకు   నీరు సమర్పించండి. తులసి చెట్టు ఎదుట గోమయంతో శుద్ది చేసి ఆవునెయ్యి దీపం వెలిగించండి.  ఆ తరువాత పసుపు.. కుంకుమ.. గంధంతో అలంకారం చేసి తులసి మాతను భక్తితో పూజించండి.  ఇలా చేయడం వలన తులపి మాత సంతృప్తి చెంది..అఖండ ఐశ్వర్యాన్ని  ఇస్తుందని పండితులు చెబుతున్నారు. 

సంకల్పం చెపుకొన్న తరువాత పూలతో ఈ క్రింద తెలిపిన నామాలు చదువుతూ శ్రద్దగా పూజ చేయాలి. 

  • ఓం శ్రీ తులస్యయే నమః.
  •  ఓం నందిన్యై నమః 
  • ఓం దేవ్యై నమః 
  • ఓం శిఖిన్యై నమః 
  •  ఓం ధారిణ్య నమః
  • ఓం ధాత్ర్యై నమః 
  • ఓం సావిత్రియే నమః.
  •  ఓం సత్యసంధాయై నమః 
  •  ఓం కలహారిణ్యై నమః 
  • ఓం గౌరాయై నమః 
  •  ఓం దేవగీతాయై నమః 
  •  ఓం ద్రవీయస్య నమః 
  • ఓం పద్మిన్య నమః 
  • ఓం సీతాయై నమః 
  • ఓం రుక్మిణ్యాయ నమః 
  •  ఓం ప్రియభూషణాయై నమః 
  •  ఓం శ్రేయస్యయే నమః 
  •  ఓం శ్రీమత్య నమః
  •  ఓం మాన్యాయై నమః
  •  ఓం గౌరాయై నమః 
  • ఓం గౌతమార్చితాయై నమః
  • ఓం త్రేతాయై నమః
  • ఓం త్రిపాఠగాయై నమః.
  • ఓం త్రిపాదాయై నమః
  • ఓం త్రిమూర్త్యై నమః
  • ఓం జగత్రయాయై నమః
  • ఓం త్రాసిన్యై నమః
  • ఓం గాత్రాయై నమః.
  • ఓం గాత్రియాయై నమః
  • ఓం గర్భవారిణ్యై నమః
  • ఓం శోభనాయై నమః.
  • ఓం సమయై నమః.
  • ఓం ద్విర్దాయై నమః 
  • ఓం ఆరాధ్యాయ నమః
  • ఓం యజ్ఞవిద్యాయై నమః
  • ఓం మహావిద్యాయై నమః
  • ఓం గుహ్యవిద్యాయై నమః
  • ఓం కామాక్షాయై నమః
  • ఓం కులాయై నమః
  • ఓం శ్రియై నమః.
  • ఓం భూమ్యై నమః
  • ఓం భవిత్రియాయ నమః
  • ఓం సావిత్రియే నమః 
  • ఓం సర్వేదావిదంవరాయై నమః 
  • ఓం శంఖిన్యై నమః
  • ఓం చక్రాణ్యై నమః.
  • ఓం చారిణ్యై నమః
  • ఓం చాపలేక్షణాయై నమః
  • ఓం పీతాంబరాయై నమః.
  • ఓం ప్రోత్ సోమాయై నమః
  • ఓం సౌరసాయై నమః
  • ఓం అక్షిణ్యై నమః.
  • ఓం అంబాయై నమః 
  • ఓం సరస్వత్యై నమః
  • ఓం సంశ్రయాయై నమః
  • ఓం సర్వ దేవత్యై నమః
  • ఓం విశ్వాశ్రయాయై నమః
  • ఓం సుగంధినాయ నమః.
  • ఓం సువస్నాయై నమః
  • ఓం వరదాయై నమః
  • ఓం సుశ్రోణ్యై నమః.
  • ఓం చంద్రభాగాయై నమః 
  • ఓం యమునాప్రియాయ నమః
  • ఓం కావేర్యై నమః
  • ఓం మణికర్ణికాయై నమః
  • ఓం అర్చిన్యై నమః
  • ఓం స్థాయిన్యై నమః.
  • ఓం దాన్ప్రదాయై నమః 
  • ఓం ధనవత్యై నమః
  • ఓం సోచ్యమానసాయై నమః
  • ఓం శుచిన్యై నమః 
  • ఓం శ్రేయస్యయే నమః 
  • ఓం ప్రీతిచిన్తేక్ష్ణాయై నమః 
  • ఓం విభూత్యై నమః 
  • ఓం ఆకృత్యై నమః
  • ఓం ఆవిర్భూత్యై నమః.
  • ఓం ప్రభావిన్యై నమః
  • ఓం ​​గాంధీన్యై నమః
  • ఓం స్వర్గిణ్యై నమః
  • ఓం గదాయై నమః
  • ఓం వేద్యాయై నమః
  • ఓం ప్రభాయై నమః.
  • ఓం సరస్యై నమః.
  • ఓం సర్శివాసాయై నమః
  • ఓం సరస్వత్యై నమః.
  • ఓం శరవత్యై నమః
  • ఓం రసిన్యై నమః
  • ఓం కలిన్యై నమః.
  • ఓం శ్రేయోవత్యై నమః 
  • ఓం యమాయై నమః
  • ఓం బ్రహ్మప్రియాయై నమః
  • ఓం శ్యాంసుందరాయై నమః
  • ఓం రత్నరూపిణ్య నమః
  • ఓం శమనిధినాయ నమః.
  • ఓం శతానందాయై నమః
  • ఓం శతద్యుతయే నమః
  • ఓం శితికాంతాయై నమః.
  • ఓం ప్రయాయై నమః
  • ఓం ధాత్ర్యై నమః 
  • ఓం శ్రీ వృన్దావణ్యై నమః 
  • ఓం కృష్ణాయై నమః.
  • ఓం భక్తవత్సలాయై నమః 
  • ఓం గోపికాక్రీడాయై నమః 
  • ఓం హరాయై నమః.
  • ఓం అమృతృపిణ్యాయ నమః 
  • ఓం భూమ్యై నమః
  • ఓం శ్రీ కృష్ణకాంతాయై నమః 
  • ఓం శ్రీ తులసాయ నమః

 ఆ తరువాత అగర్​ బత్తీలు వెలిగించాలి.. నైవేద్యంగాపాయసం.. బెల్లం.. సమర్పించాలి.  కర్పూరం వెలిగించి హారతి ఇవ్వాలి.