అధికారాన్ని అడ్డుపెట్టుకుని భూ కబ్జాలు చేస్తున్నరు

అధికారాన్ని అడ్డుపెట్టుకుని భూ కబ్జాలు చేస్తున్నరు

హైదరాబాద్ నడిగడ్డన..బంజారాహిల్స్ లో 4వేల 539 గజాల స్థలాన్ని అధికారికంగా TRS రాత్రికి రాత్రి కబ్జా చేయడం నేరమన్నారు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. ఇది ముమ్మాటికీ టీఆర్ఎస్ అధికారిక భూకబ్జా అని మండిపడ్డారు. ప్రభుత్వం మళ్ళీ వస్తుందో రాదోననే భయంతో అధికార పార్టీ ఇలా చేస్తుందని విమర్శించారు. రౌడీలు  బెదిరించి భూకబ్జాలు చేస్తే, TRS పార్టీ మాత్రం అధికారాన్ని దుర్వినియోగం చేసి దొడ్డిదారిన GOలు తెచ్చి ఖరీదైన భూములు కబ్జా చేస్తున్నారని విమర్శించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు, దళితులకు మూడెకరాలు ఇచ్చేందుకు ప్రభుత్వానికి భూములు దొరకడం లేదన్నారు.  కులసంఘాలకు ఊరు అవతల వెలి వేసినట్లు భూకేటాయింపులు చేసి.. TRSకు మాత్రం వందకోట్ల విలువైన భూమిని బంజారాహిల్స్ లో కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
..
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లో భూములను TRS నాయకులు దోచుకుంటున్నారని ఆరోపించారు శ్రవణ్. ఫిలీంనగర్ లో వేలకోట్ల విలువైన 11ఎకరాల భూమిని రెడ్ ఫోర్ట్ కంపెనీ పేరుతో MP రంజిత్ రెడ్డికి కట్టబెట్టారన్నారు. అతి తక్కువ వయసు ఉన్న TRS పార్టీ ఆస్తి 816 కోట్లకు ఎలా చేరిందో చెప్పాలన్నారు శ్రవణ్.  రాష్ట్ర కార్యాలయానికి కూతవేటు దూరంలో జిల్లా కార్యాలయానికి వందకోట్ల విలువైన స్థలం కేటాయించారని.. ఇదంతా ఎవడబ్బ సొమ్మని ప్రశ్నించారు. TRS పార్టీకి అక్రమంగా భూమి కేటాయిస్తూ జారీ చేసిన జీవో 47ను వెంటనే రద్దు చేయాలన్నారు. ఆ స్థలంలోనే పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టియ్యాలని డిమాండ్ చేశారు దాసోజు శ్రవణ్.

మరిన్ని వార్తల కోసం

రాజీవ్ స్వగృహ ఫ్లాట్లకు నోటిఫికేషన్

ఈ సారి స్టూడెంట్లకు యూనిఫామ్స్ అందుడు కష్టమే