రాజీవ్ స్వగృహ ఫ్లాట్లకు నోటిఫికేషన్

రాజీవ్ స్వగృహ ఫ్లాట్లకు నోటిఫికేషన్

హైదరాబాద్, వెలుగు:  హైదరాబాద్​లోని బండ్లగూడ, పోచారంలో ఉన్న రాజీవ్ స్వగృహ ఇండ్లను అమ్మేందుకు హౌసింగ్ డిపార్ట్ మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2,971 ఫ్లాట్లకు గురువారం నుంచి వచ్చే నెల 14 వరకు  మీసేవ సెంటర్లు, టీ ఫోలియో మొబైల్ యాప్, వెబ్ సైట్ (swagruha.telangana.gov.in)లో లేదా బండ్ల గూడ, పోచారంలో ఫ్లాట్ల దగ్గర అప్లికేషన్ పెట్టుకోవాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

బండ్లగూడలో పూర్తయిన ఫ్లాట్లకు ఒక్కో చదరపు అడుగు రూ.3 వేలు, పూర్తి కాని వాటికి రూ.2,750, పోచారంలో ఫినిష్ అయిన ఫ్లాట్లకు చదరపు అడుగుకు రూ.2,500, ఆన్ ఫినిష్డ్ ఫ్లాట్లకు రూ.2,250 రేట్లను ఖరారు చేశారు. ఈ ఫ్లాట్లను గురువారం నుంచి వచ్చే నెల 14 వరకు సందర్శించవచ్చని అధికారులు తెలిపారు. వచ్చే నెల 22న కంప్యూటర్ లాటరీ ద్వారా ఇండ్ల అలాంట్ మెంట్ ఉంటుందన్నారు.

ఇక ఈ ఫ్లాట్లకు లోన్ లు ఇచ్చే విషయానికి సంబంధించి హౌసింగ్ డిపార్ట్ మెంట్ బ్యాంకర్లతో ఈ నెల 13న మీటింగ్ నిర్వహించనుంది. ఫ్లాట్స్ కొనాలనుకునే వారికి వెంటనే లోన్ అందేలా, బండ్ల గూడ, పోచారంలో బ్యాంకులు తమ స్టాల్స్ ఏర్పాటు చేయనున్నాయి. ఈ ఫ్లాట్ల అమ్మకం ద్వారా సుమారు రూ. 800 కోట్లు ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.