దాసోజు శ్రవణ్ బీజేపీలో చేరాలి

దాసోజు శ్రవణ్ బీజేపీలో చేరాలి

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈనెల 21న అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరనున్నారని బండి సంజయ్ తెలిపారు. మునుగోడులో బీజేపీ భారీ మెజార్టీతో గెలవబోతుందని దీమా వ్యక్తం చేశారు. దాసోజు శ్రవణ్ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని..ఎన్నో విషయాలపై అవగాహన ఉందన్నారు. గతంలో ఏబీవీపీలో కూడా పనిచేశారని..తిరిగి సొంత గూటికి రావాలని ఆయన్ని కోరుతున్నట్లు తెలిపారు. అవినీతి ముఖ్యమంత్రిని గద్దె దింపడమే తమ లక్ష్యమన్నారు. 

పోచంపల్లి మండలం ముక్తాపూర్ సమీపంలో ఆయన మీడియా మాట్లాడుతూ..మూసీ నదిలో స్నానం చేస్తా..హుస్సేన్ సాగర్ నీటిని కొబ్బరి నీళ్ల లేక్క చేస్తానన్న కేసీఆర్ హామీలు ఏమైనయ్ అని ప్రశ్నించారు. మూసీనది నీళ్లను కేసీఆర్ కు పంపిస్తానని తెలిపారు. మూసీ కాలుష్యం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. ప్రజల ఇబ్బందులు  తెలియడానికే ముఖ్యమంత్రికి మూసీ నీళ్లను పంపిస్తున్నామన్నారు. ఇప్పటికైన ప్రజల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.