రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్చ లేకుండా పోతోంది: శ్రవణ్

రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్చ లేకుండా పోతోంది: శ్రవణ్

రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్చ లేకుండా పోతోందని… ఈ విషయంలో పోలీసుల తీరు బాగాలేదని అన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. రాష్ట్రంలో మిస్సింగ్ కేసులపై స్పందించినందుకు.. తమ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలపై.. తప్పుడు కేసులు పెట్టారని శ్రవణ్ అన్నారు. ఇదివరకు.. డీజీపీ కూడా 545మంది మిస్ అయినట్లు కన్ ఫామ్ చేశారని..అందులో… 318 మంది ఇంకా ట్రేస్ అవుట్ కాలేదని ట్వీట్ చేసినట్లు తెలిపారు.

కాంగ్రెస్ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి వారి భవిష్యత్తును నాశనం చేయవద్దని కోరామని శ్రవణ్ చెప్పారు. ప్రజల కోసమే పనిచేయాల్సిన పోలీసు వ్యవస్థ… ప్రభుత్వ బాస్ ల రక్షణ కోసం పనిచేసేలా మారిందని దాసోజు శ్రవన్ అన్నారు.

రాష్ట్రంలో 545 మంది ఆచూకీ తెలియకుండా పోయిందని ఇటీవల ఓ వార్తా పత్రికలో.. వచ్చిన న్యూస్ ను కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధి వెంకట్ తన సోషల్ ఎకౌంట్ లో షేర్ చేశాడు. దీంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి 505 క్లాస్ 1, క్లాస్ బీ పేరిట కేసులు పెట్టారు. ఈ విషయంపై దాసోజు శ్రవణ్ డీజీపీని కలిసి వెంటనే కేసులు ఎత్తివేయాలని కోరారు. ఇందుకు డీజీపీ  సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.