పేరు కోసమే కేసీఆర్ ఆరాటం

పేరు కోసమే కేసీఆర్ ఆరాటం

హైదరాబాద్ : తెలంగాణ రైతుల పాలిట సీఎం కేసీఆర్ రాక్షసుడిలా మారిండని కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. రాష్ట్రంలో అన్నదాతల అవస్థలు పట్టించుకోకుండా పంజాబ్ రైతులను ఓదార్చేందుకు వెళ్లారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాల గురించి ఒక్కరోజు కూడా కేసీఆర్ మాట్లాడలేదని శ్రవణ్ మండిపడ్డారు.  కేసీఆర్ అక్కడి రైతుల్ని పరామర్శిస్తే మరి ఇక్కడి రైతులను పంజాబ్ సీఎం పట్టించుకోవాలా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 8,400 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే వెయ్యి మంది మాత్రమే చనిపోయారని వారికి మాత్రమే ఆర్థిక సాయం చేశారని శ్రవణ్ చెప్పారు.

సీఎం కేసీఆర్ దేశవ్యాప్తంగా పేరు రావాలని ఆరాటపడుతున్నారని దాసోజు శ్రవణ్ విమర్శించారు. ధాన్యం కొంటామని ప్రకటించి సకాలంలో కొనకపోవడంతో వడ్లన్నీ వానపాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి టీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో రైతన్నలు గులాబీ నేతలను నిలదీయాలని శ్రవణ్ పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తల కోసం..

కేసీఆర్ కుటుంబాన్ని ఏం చేయాలో ప్రజలే నిర్ణయిస్తారు

జకార్తా బయలుదేరిన పురుషుల హాకీ టీం