జకార్తాకు బయల్దేరిన పురుషుల హాకీ టీం

జకార్తాకు  బయల్దేరిన  పురుషుల హాకీ టీం

బెంగళూరు: ఇండోనేషియాలో జరగనున్న ఆసియా కప్ –22 లో పాల్గొనేందుకు భారత పురుషుల హాకీ జట్టు శుక్రవారం జకార్తాకు బయలుదేరింది. ఇక ఈ నెల 23 నుంచి ఆసియా కప్  మొదలు కానుంది. ఇండియా, జపాన్, మలేషియా, పాకిస్తాన్, సౌత్ కొరియా, బంగ్లాదేశ్, ఒమన్ దేశాలు ఈ టోర్నీలో ఆడనున్నాయి. పూల్ –ఏ లో ఇండియాతో పాటు పాకిస్తాన్, జపాన్, ఇండోనేషియా, పూల్ –బీ లో సౌత్ కొరియా, మలేషియా, బంగ్లాదేశ్, ఒమన్ జట్లు ఉన్నాయి. కాగా.. టోర్నీ ప్రారంభం రోజునే ఇండియా తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో తలపడనుంది. చివరిసారి 2017లో బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన 10వ ఆసియా కప్ లో భారత్ టైటిల్ కైవసం చేసుకుంది. అలాగే 2022లో బీజింగ్ లో జరిగిన ఒలంపిక్స్ లో కెప్టెన్ బీరేంద్ర లాక్రా నేతృత్వంలోని  భారత పురుషుల హాకీ జట్టు కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే. అదే ఊపులో ఇప్పుడు ఆసియా కప్ సాధించేందుకు భారత జట్టు సిద్ధమైంది. ఈ మేరకు బెంగళూరులో శిక్షణ పూర్తి చేసుకుని... జకార్తాకు బయలుదేరింది. ఇప్పటికే భారత్ 3 ఆసియా కప్ టైటిళ్లు సాధించింది. 

ఇక జట్టు విషయానికొస్తే...

గోల్ కీపర్స్

పంకజ్ కుమార్ రజక్, సూరజ్ కర్కారె

డిఫెండర్స్

నీలం సంజీప్ జెస్, యశ్ దీప్ సివాచ్, అభిషేక్ లాక్రా, బీరేంద్ర లాక్రా, మన్ జీత్, దిప్సాన్ టర్కీ

మిడ్ ఫీల్డర్స్

విష్ణుకాంత్ సింగ్, రాజ్ కుమార్ పాల్, మరీశ్వరన్ శక్తివేల్, శేష గౌడ బీఎం, సిమ్రాన్ జీత్ సింగ్

ఫార్వర్డ్

పవన్ రాజ్ భార్, అభరన్ సుదేవ్, ఎస్వీ సునీల్, ఉత్తమ్ సింగ్, ఎస్ కార్తీ

రిప్లేస్మెంట్ ప్లేయర్స్, స్టాండ్ బైస్

మనీందర్ సింగ్, పవన్, పర్దీప్ సింగ్, అంకిత్ పాల్, అంగడ్ బీర్ సింగ్

మరిన్ని వార్తల కోసం...

ఐపీఎల్ లో టాప్ 5 అత్యధిక స్కోర్లు చేసిన ..

నిఖత్ జరీన్ కు అభినందనల వెల్లువ..