ఐపీఎల్ లో టాప్ 5 అత్యధిక స్కోర్లు చేసిన ఆటగాళ్లు

ఐపీఎల్ లో టాప్ 5 అత్యధిక స్కోర్లు చేసిన ఆటగాళ్లు

ఐపీఎల్ అంటేనే   రికార్డులకు పెట్టింది పేరు. ఈ పొట్టి ఫార్మాట్ లో సీజన్ కు ఒక కొత్త రికార్డ్ నమోదవుతుంది. అత్యధిక వికెట్లు, అత్యధిక వ్యక్తిగత స్కోర్  చేసి రికార్డ్ సృష్టిస్తారు. అయితే ఇప్పటి వరకు అత్యధిక స్కోర్ చేసిన టాప్ 5 బ్యాట్స్ మెన్ ఎవరెవరో చూద్దాం.

క్రిస్ గేల్

ఈ వెస్టిండీస్ బ్యాట్స్ మెన్ ఫామ్ లో ఉన్నాడంటే  పరుగుల ఊచకోత కోస్తాడు. స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తాడు. బౌండరీలు బాదినంత సులువుగా సెంచరీలు చేస్తాడు. ఐపీఎల్ లో అత్యధిక స్కోర్, వేగవంతమైన సెంచరీ ఇప్పటికీ క్రిస్ గేల్ పేరుతోనే ఉంది.

2013 ఏప్రిల్ లో  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర తరపున ఆడిన గేల్ పుణె వారియర్స్ పై 66 బంతుల్లో 175 పరుగులు చేశాడు. ఇందులో 13ఫోర్లు, 17 సిక్సులు ఐపీఎల్ లో ఇప్పటికి ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు వేగవంతమైన సెంచరీ. ఈ రికార్డ్ ను ఎవరూ బ్రేక్ చేయలేదు.

బ్రెండన్ మెక్ కల్లమ్

 ఐపీఎల్ లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన వారి లిస్టులో మెక్ కల్లమ్ రెండవ స్థానంలో ఉన్నాడు. 2008 ఏప్రిల్ 18న రాయల్  కోల్ కతా తరపున ఆడిన  మెక్ కల్లమ్ రాయల్ చాలెంజర్స్ పై  158 పరుగులు చేశాడు. 73 బంతుల్లో 10 ఫోర్లు 13 సిక్సర్లు బాదాడు.

ఏబీ డివిలియర్స్

అత్యధిక స్కోర్ చేసిన వారిలో మూడో స్థానంలో రాయల్ చాలెంజర్స్ బ్యాట్స్ మెన్ ఏబీ డివిలియర్స్ ఉన్నాడు. 2015 మే 10న ముంబై ఇండియన్స్ పై 59 బంతుల్లో 133 పరుగులు చేశాడు.

 

క్వింటన్ డికాక్ 

ఈ సారి భీకర్ ఫామ్ లో ఉన్న లక్నో సూపర్ జాయింట్స్ బ్యాట్స్ మెన్ డికాక్ 69 బంతుల్లో 140 పరుగులు కొట్టాడు. ఈ సీజన్ లో కోల్ కతాపై ఈ స్కోర్ ను నమోదు చేశాడు. 

కేఎల్ రాహుల్

అత్యధిక స్కోర్ చేసిన వ్యక్తుల్లో కేఎల్ రాహుల్ ఐదో స్థానంలో ఉన్నాడు. 2020 సీజన్ లో పంజాబ్ తరపున ఆడిన రాహుల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై  69 బంతుల్లో  132 పరుగులు చేశాడు. ఆ తర్వాతి  స్థానాల్లో రిషబ్ పంత్ 128, మురళి విజయ్ 127 పరుగులతో ఉన్నారు.