కేసీఆర్ కుటుంబాన్ని ఏం చేయాలో ప్రజలే నిర్ణయిస్తారు

కేసీఆర్ కుటుంబాన్ని ఏం చేయాలో ప్రజలే నిర్ణయిస్తారు
  • ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ ఫ్యామిలీ అప్పులపాలు చేసింది
  • పెట్రో ధరల పెంపును వ్యతిరేకిస్తూ మహిళా కాంగ్రెస్ నిరసన
  • మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు

హైదరాబాద్: గ్యాస్ సబ్సిడీ ఇవ్వకపోతే సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తామన్నారు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు. పెరిగిన పెట్రోల్, గ్యాస్, నిత్యవసర ధరలతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వెంటనే గ్యాస్ కి సబ్సిడీ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదన్నారు సునీతరావు. పెట్రో ధరల పెంపును వ్యతిరేకిస్తూ మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. 
ఈ సందర్భంగా మహిళా కాంగ్రెస్ నేత సునీతారావు మాట్లాడుతూ పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరల పెంపు ప్రభావంతో నిత్యావసర సరుకుల ధరలన్నీ పెరిగిపోయాయని.. సామాన్యుడు బతికే పరిస్థితి లేదని ముష్టి ఎత్తుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని సునీతారావు ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధి లేక.. చాలీ చాలని జీతాలతో బతుకులీడుస్తున్నారు.. 15వ తేదీ వచ్చినా చాలా మందికి జీతాలు రాని పరిస్థితి నెలకొందన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు మిగులు నిధులతో ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కేసీఆర్ కుటుంబం అప్పులపాలు చేసిందని, రాబోయే రోజుల్లో కేసీఆర్ కుటుంబాన్ని ఏం చేయాలో ప్రజలే నిర్ణయిస్తారని సునీతారావు పేర్కొన్నారు. పెరిగిన ధరలను నియంత్రించాలని డిమాండ్ చేశారు.  గ్యాస్ సబ్సిడీ ఇవ్వకపోతే  ప్రగతి భవన్ ను ముట్టడిస్తామని సునీతారావు హెచ్చరించారు. 

 

 

 

ఇవి కూడా చదవండి

 

నిఖత్ జరీన్ కు అభినందనల వెల్లువ

ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం

కల్లాల్లో ధాన్యం తడిసిపోతోందని రైతుల ఆందోళన

దిశ నిందితుల ఎన్కౌంటర్ బూటకం

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పోటీ - పవన్ కళ్యాణ్