కల్లాల్లో ధాన్యం తడిసిపోతోందని రైతుల ఆందోళన

కల్లాల్లో ధాన్యం తడిసిపోతోందని రైతుల ఆందోళన

మెదక్ జిల్లా: పంటలు చేతికొచ్చి రోజులు గడుస్తున్నా ధాన్యం కొంటలేరని.. మరోవైపు కల్లాల్లో నిల్వ చేసిన వడ్లు అకాల వర్షాలకు తడిసిపోతోందని రైతులు ఆందోళనలకు దిగారు. ఐకేపీ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్న రైతులు కాటా వేయకుండా గంటలతరబడి వేచి చూసేలా చేస్తున్నారని ఆరోపించారు. ధాన్యం కొనడం లేదంటూ మెదక్ జిల్లాలోని పలుచోట్ల రైతులు ధర్నాకు దిగారు.  
ఐకేపీ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్న రైతులు రోడ్లపైకి వచ్చి రస్తారోకో చేపట్టారు. ప్రగతి ధర్మారంలో రైతులు రాస్తారోకో నిర్వహించారు.

అలాగే రామాయంపేట-గజ్వేల్ రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. ధాన్యం కొనుగోలు చేయకుండా ఆలస్యం చేస్తున్నారంటూ ఆందోళన చేపట్టారు. ధాన్యం కొనుగోలు సెంటర్ల దగ్గర వరి ధాన్యం నిల్వలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయని రైతులు అంటున్నారు. అంతేకాకుండా లారీల నుంచి ధాన్యాన్ని అన్ లోడ్ చేయడంలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలులో ఆలస్యం అవడంతో అకాల వర్షాల కారణంగా నష్టపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు ప్రగతి ధర్మారం రైతులు. 

 

 

ఇవి కూడా చదవండి

దిశ నిందితుల ఎన్కౌంటర్ బూటకం

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పోటీ - పవన్ కళ్యాణ్

దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసు.. హైకోర్టుకు బదిలీ