ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం

ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం
  • 30 నుంచి 40కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం
  • హైదరాబాద్ వాతావరణ కేంద్రం


హైదరాబాద్: రాష్ట్రంలో ఈరోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. హైదరాబాద్ నగరంతోపాటు కామారెడ్డి, నిజాంబాద్ ,సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, నారాయణపేట ,మహబూబ్నగర్, సూర్యాపేట్ ,నల్గొండ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. 
అలాగే  ఉరుములు మెరుపులతోపాటు  ఈదురు గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. అకాల వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, నష్టపోకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. 

 

ఇవి కూడా చదవండి

కల్లాల్లో ధాన్యం తడిసిపోతోందని రైతుల ఆందోళన

దిశ నిందితుల ఎన్కౌంటర్ బూటకం

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పోటీ - పవన్ కళ్యాణ్