
హైదరాబాద్, వెలుగు : తెలంగాణ అప్పుల పాలైందని ప్రధాని నరేంద్రమోదీ దగ్గర చెప్పి.. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రం పరువు తీశారని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దాసోజు శ్రవణ్ ఫైర్ అయ్యారు. డబ్బులు లేనప్పుడు దేశవ్యాప్తంగా మీడియాకు అడ్వర్టైజ్మెంట్లు ఎందుకిచ్చారని ఆయన ప్రశ్నించారు. లంకె బిందెలున్నాయని వస్తే.. ఖాళీ బిందెలున్నాయని చెప్తున్న సీఎం.. డబ్బులు దుబారా ఎందుకు చేస్తున్నారని ఆయన అడిగారు. బుధవారం తెలంగాణ భవన్లో శ్రవణ్ మీడియాతో మాట్లాడారు. రైతుబంధు రూ.15 వేలు ఇస్తామని, డిసెంబర్9వ తేదీనే రూ.4 వేల పింఛన్ఇస్తామని చెప్పి ఇప్పుడు అప్లికేషన్లు ఎందుకు అడుగుతున్నారని ప్రశ్నించారు. ప్రజలెవరూ కరెంట్బిల్లులు కట్టొద్దని చెప్పారని.. అది ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలన్నారు.
సీఎం హోదాలో ఉన్నా.. ప్రతిపక్ష నేత మాదిరిగానే నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. ‘‘సీఎం రేవంత్భూమి మీద లేరు.. గాలిలో తేలియాడుతున్నారు”అని ఎద్దేవా చేశారు. పేమెంట్కోటాలో పీసీసీ చీఫ్ అయిన రేవంత్‌రెడ్డి.. కేటీఆర్‌ను పదే పదే మేనేజ్మెంట్కోటా అనడం సరికాదన్నారు. సెక్రటేరియెట్, ప్రగతి భవన్దుబారాగా అనిపిస్తే సెక్రటేరియెట్‌ను బీఆర్ అంబేద్కర్హాస్పిటల్గా, ప్రగతి భవన్‌ను ఎడ్యుకేషనల్హబ్ లేదా హాస్పిటల్ గా మార్చాలని ఆయన డిమాండ్‌చేశారు. పేయింటర్అయిన రేవంత్‌కు కోట్ల ఆస్తులు, జూబ్లీహిల్స్‌లో ఇండ్లు ఎలా వచ్చాయో చెప్పాలన్నారు. సెక్రటేరియెట్‌ను పరిపాలనకు వాడాలే తప్ప రాజకీయాల కోసం కాదని శ్రవణ్పేర్కొన్నారు.