ప్రగతి భవన్ లో కేసీఆర్ ను కలిసిన దాసోజు శ్రవణ్

ప్రగతి భవన్ లో కేసీఆర్ ను కలిసిన దాసోజు శ్రవణ్

టీఆర్ఎస్ లో చేరిన దాసోజు శ్రవణ్ ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.  బీజేపీకి రాజీనామా చేసిన  శాసన మండలి మాజీ ఛైర్మన్ స్వామి గౌడ్, దాసోజు శ్రవణ్ ఇవాళ టీఆర్ఎస్ లో చేరారు. టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో  స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్ పార్టీ కండువాలు కప్పుకున్నారు.  గతంలో దాసోజు శ్రవణ్ టీఆర్ఎస్ లో  కీలకంగా పని చేశారు. సీఎం కేసీఆర్ కు సన్నిహితుడిగా ఉన్నారు. టీఆర్ఎస్ నుంచి భువనగిరి ఎంపీ టికెట్ ను ఆశించిన శ్రవణ్.. టికెట్ దక్కకపోవడంతో మనస్థాపానికి గురై పార్టీని వీడారు. టీఆర్ఎస్కు గుడ్ బై చెప్పిన శ్రవణ్ ఆ తర్వాత కాంగ్రెస్లో చేరారు.  కాంగ్రెస్ కు రిజైన్ చేసి ఆగస్ట్ 7 న బీజేపీలో చేరారు. మళ్లీ ఇవాళ టీఆర్ఎస్ లో చేరారు.

చివరి శ్వాస వరకూ కేటీఆర్ తోనే : దాసోజు శ్రవణ్  

తన అనాలోచిత నిర్ణయాల వల్ల టీఆర్ఎస్ పార్టీని వీడానని దాసోజు శ్రవణ్ అన్నారు. మళ్లీ ఏడు సంవత్సరాల తరవాత సొంతగూటికి రావడం సంతోషంగా ఉందన్నారు. ఆశలు, ఆకాంక్షలతో బీజేపీలోకి వెళ్లానని, అందులో కొందరు నాయకులు మూస రాజకీయాలు చేస్తున్నారని శ్రవణ్ ఆరోపించారు. దేశానికి తలమానికంగా కేసీఆర్‌ తెలంగాణను తీర్చిదిద్దారని తెలిపారు. నవ భారత నిర్మాణం కోసం ఉడుతా భక్తిగా టీఆర్ఎస్ లో చేరుతున్నట్టుగా శ్రవణ్ తెలిపారు. చివరిశ్వాస ఉన్నంత వరకూ కేటీఆర్ కు అండగా ఉంటామని వెల్లడించారు.