ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ డబ్బులు,లిక్కర్ పంచుతున్నరు

ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ డబ్బులు,లిక్కర్ పంచుతున్నరు

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ,బీజేపీ పార్టీలు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నాయని ఆరోపించారు కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతూ విచ్చలవిడిగా డబ్బులు.. లిక్కర్ ను పంచుతున్నాయని అన్నారు. ఈ రెండు పార్టీలు  ప్రజాస్వామ్యాన్ని అవమాన పరుస్తున్నాయని.. రాష్ట్ర ఎన్నికల కమిషన్, కేంద్రం నుంచి వచ్చిన ముగ్గురు ఎలక్షన్ అధికారులు TRS పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్నారని విమర్శించారు.

హుజురాబాద్ లో జరుతున్నయి ఎన్నికలు కాదని.. రాజకీయ వ్యాపారం వ్యభిచారమని తీవ్రంగా ఆరోపించారు దాసోజు శ్రవణ్. తెలంగాణలో ఎక్కడ ప్రజాస్వామ్యం కనిపించడం లేదని.. హారాజ్  పాడి ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందన్నారు. టీఆర్ఎస్ పార్టీ,బీజేపీ నాయకులు ఇద్దరు డబ్బులు పంచుతున్నారని అన్నారు. తెలంగాణ సమాజాన్ని మొత్తం మద్యం మత్తులో ఊగేలా రాష్ట్ర ప్రభుత్వం చేస్తోందన్నారు. ఎన్నికలను రద్దు చేస్తూ .. ఎన్నికల కమిషన్ శశాంక్ గోయల్ ని సస్పెండ్ చేస్తూ కొత్త ఎన్నికల కమిషన్ పంపాలంటూ విజ్ఞప్తి చేశామన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నక్సలైట్లు వస్తే బాగుంటుందని అనిపిస్తోందన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను  పక్కన వదిలేసి హుజరాబాద్ లో మూడు వేల కోట్లను ఖర్చు పెట్టారని అన్నారు దాసోజు శ్రవణ్. 

హుజురాబాద్ ఉపఎన్నికల్లో డబ్బు, మద్యంతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామన్న దాసోజు.. ఎన్నికలపై సానుకూలంగా స్పందించింది ఎంక్వయిరీ కి పంపిస్తామని హామీ ఇచ్చారన్నారు.