నిమ్స్ నర్సుల ఆందోళనకు దాసోజు శ్రవణ్ మద్దతు

నిమ్స్ నర్సుల ఆందోళనకు దాసోజు శ్రవణ్ మద్దతు

హైదరాబాద్: సర్వీసు రైగ్యులరైజ్ చేయాలంటూ నిమ్స్ హాస్పిటల్ కాంట్రాక్ట్ నర్సులు చేపట్టిన ఆందోళనకు కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ సంఘీభావం ప్రకటించారు. కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి సేవలందించిన నర్సుల కష్టాన్ని ప్రభుత్వం గుర్తించకపోవడాన్ని తప్పుబట్టారు. కాంట్రాక్టు పేరుతో ఏళ్లుగా కేసీఆర్ సర్కారు శ్రమ దోపిడీ చేయడం నేరం, కృతజ్ఞతారాహిత్యం అని శ్రవణ్ విమర్శించారు. ఇప్పటికైనా కాంట్రాక్టు నర్సుల కష్టాన్ని గుర్తించి వారి జీతభత్యాలు పెంచడంతో పాటు సర్వీసు రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. 

మరిన్ని వార్తల కోసం..

డ్రగ్స్‌ కేసులో కీలక నిందితుడు అరెస్ట్‌

25వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సబ్ ఇన్స్పెక్టర్