
న్యూఢిల్లీ: ఫ్రాన్స్‌కు చెందిన దసో ఏవియేషన్ భారత్‌లోని దసో రిలయన్స్ ఏరోస్పేస్ (డీఆర్ఏఎల్)లో తన వాటాను 2 శాతం పెంచుకోనుంది. దీనితో డీఆర్ఏఎల్లో దసో ఏవియేషన్ వాటా 49 శాతం నుంచి 51 శాతానికి పెరుగుతుంది. డీఆర్ఏఎల్ సంస్థ దసో ఏవియేషన్‌కు అనుబంధ సంస్థగా మారుతుంది.
ప్రస్తుతం డీఆర్ఏఎల్లో రిలయన్స్ ఏరోస్పేస్ (ఆర్ఏఎల్)కు 51 శాతం వాటా ఉంది. ఈ లావాదేవీల తర్వాత రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుబంధ సంస్థ అయిన ఆర్ఏఎల్ వాటా 49 శాతానికి తగ్గుతుంది. ఈ వాటా పెంపు ద్వారా భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు గ్యారెంటీలు, వారెంటీలను బలోపేతం చేయాలని దసో లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు రూ. 176 కోట్లు వస్తాయి.