మాయాలోకం : డేటింగ్ లో పడి.. ఏం తింటున్నారో.. ఏమో..

మాయాలోకం : డేటింగ్ లో పడి.. ఏం తింటున్నారో.. ఏమో..

డేటింగ్ యాప్స్ వాడకం మాట ఇప్పుడిప్పుడే మనదేశంలో కూడా పెరుగుతోంది, కానీ, విదేశాల్లో ఇవి ఇప్పటికే చాలా పాపులర్. లైకులు, టేస్ట్లు మ్యాచ్ ఐతే ఒకరినొకరు అర్థం చేసుకొని తర్వాత పెళ్లి చేసుకోవడం.. ఈ డేటింగ్ యాప్స్ ముఖ్య ఉద్దేశం. అయితే అన్ని చోట్లా ఈ యాప్స్ 'మిస్ యూజ్' అవుతున్నాయి. రోజుకో కొత్త సమస్యను తెచ్చి పెడుతున్నాయి.

డేటింగ్ యాప్స్ ద్వారా మోసాలు జరుగుతున్నాయని నిన్న మొన్నటి దాక అందరూ చెప్తుంటే, ఇప్పుడు కొత్తగా ఈ యాప్స్ ఆరోగ్యం కూడా నాశనం చేసి, ప్రాణాల మీదకు తెస్తోందని పరిశోధకులు.. చెప్తున్నారు. డేటింగ్ యాప్స్ పక్కవాళ్లను ఎట్రాక్ట్ చేయడం కోసం చాలానే ప్రయత్నాలు జరుగుతుంటాయి. అయితే ఈ ప్రయత్నాలు కొంపముంచుతున్నాయి. డేటింగ్ యాప్స్ వాడేవాళ్లు అందంగా ఉండేందుకు, బరువు తగ్గించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఈటింగ్ డిజార్డర్స్ ని కొని తెచ్చుకుంటున్నారు. 

అందం కోసం అనారోగ్యం 

అమెరికాకు చెందిన హార్వర్డ్ వర్సిటీ 1700 మందిని సర్వే చేసి ఈ వివరాలు వెల్లడించింది. డేటింగ్ యాప్స్ ఉపయోగించేవారు బరువు తగ్గడం కోసం మందులు వాడడం, బాడీ, కండలు పెంచేందుకు సప్లిమెంట్స్ వాడటం, ఎక్కువగా ఉపవాసాలు ఉండడం, వాంతులు చేసుకోవడం లాంటి హ్యాబిట్స్ పాటిస్తున్నారని తేలింది.కొన్నాళ్లుగా ఆన్లైన్ డేటింగ్ బాగా పెరుగుతూ వస్తోంది. పార్ట్నర్ కోసం చాలామంది యువతీయువకులు డేటింగ్ యాప్ ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. 

ఈ యాప్స్ ద్వారా తాము ఎంచుకోవాలనుకుంటున్న పార్టనర్ ఇష్టాయిష్టాలు, అభిరుచులతో పాటు ఫిట్ నెస్ని కూడా గమనిస్తుంటారు. ఇదే ఎక్కువ మందిని సమస్యలోకి వెడుతోంది. డేటింగ్ యాప్స్ ఉపయోగించేవాళ్లు. ఉపయోగించని వాళ్లని తీసుకొని వాళ్ల బిహేవియర్ను ఈ స్టడీలో పరిశీలించారు.   తగ్గించుకునేందుకు ఆరు రకాల అన్ హెల్దీ మెథడ్స్కు అలవాటు పడుతున్నారని . పరిశోధకులు గుర్తించారు. వాంతులు, విరేచనాలు చేసుకోవడం, ఉపవాసం ఉండటం, సన్నబడేందుకు మాత్రలు వాడటం, కండలను పెంచేందుకు స్టెరాయిడ్స్ లాంటివి వాడడం, శరీరాకృతికి కోసం సప్లిమెంట్స్ తీసుకోవడం. వంటివి చేస్తున్నారని గుర్తించారు.

 అబ్బాయిలే ఎక్కువ

సర్వే చేసిన 1,726 మందిలో 183 మంది అమ్మాయిలు, 209 మంది అబ్బాయిలు. ఉన్నారు. ఈ గ్రూపులో దాదాపు సగం మంది బరువు తగ్గించుకునేందుకు డైట్ కంట్రోల్ చేస్తున్నారు. అంతేకాకుండా, ఇందులోని ప్రతి ఐదుగురు అమ్మాయిల్లో ఒకరు. ప్రతి ముగ్గురు అబ్బాయిల్లో ఒకరు బరువు తగ్గించుకోవడానికి వాంతులు చేసుకునేవాళ్లమని చెప్పారు. అలాగే ప్రతి నలుగురు అమ్మాయిల్లో ఒకరు, ప్రతి ముగ్గురు అబ్బాయిల్లో ఒకరు సప్లిమెంట్స్ వాడేవాళ్లమని చెప్పారు. ఇక నాజూకైన శరీరం కోసం అమ్మాయిల కంటే అబ్బాయిలే ఎక్కువగా స్టెరాయిడ్స్, మందులు తీసుకుంటున్నట్లు తేలింది.

ఎంతో నష్టం

డేటింగ్ యాప్స్ ఉపయోగించే వాళ్లందరూ అందంగా కనిపించడం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఆందోళన కలిగిస్తున్నాయని ప్రొఫెసర్ అల్విన్ అన్నారు. "బరువును తగ్గించుకోవాలనుకునే వాళ్లందరిలో ఈటింగ్ డిజార్డర్ సమస్య  ఉండదు. అయితే, ఇలాంటి పద్ధతులు పాటించేవాళ్లకు మాత్రం ఇలాంటి డిజార్డర్స్, వేరే జబ్బులు వచ్చే అవకాశం ఉంది" అని అల్విన్ తెలిపారు. 

మానసిక ఆందోళన కూడా

ఇదిలా ఉంటే డేటింగ్ యాప్స్ వల్ల మానసికంగా కూడా చాలామంది ఇబ్బంది. పడుతున్నారని మరో సర్వేలో తేలింది. తమ ప్రొఫైల్ను ఎవరూ సెలెక్ట్ చేసుకోవట్లేదని చాలామంది డిప్రెషన్కు లోనవుతున్నారట. సోషల్ మీడియా వల్ల వచ్చే డిప్రెషన్ కన్నా ఇది. ఇంకా ఎక్కువగా ఉంటుందట. పార్టనర్ దొరికే సమయం లేట్ అయ్యేకొద్దీ డిప్రెషన్ మరింత పెరుగుతుందని ఆ సర్వేలో పేర్కొన్నారు. 

ప్రైవసీ ముప్పు

దీంతోపాటు రోజుకో కొత్త డేటింగ్ యాప్ పుట్టుకొస్తుందట. రోజు రోజుకీ వాటిని వాడే వాళ్ల సంఖ్య కూడా పెరుగుతోంది. అయితే ఇందులో సరైన ప్రైవసీ సెక్యూరిటీని పాటించే యాప్స్ కొన్ని ఉన్నా అవి వాడే వాళ్ల సంఖ్య తక్కువగా ఉంది. ఫ్రీగా లభించే యాప్సే ఎక్కువ మంది వాడుతున్నారు. అవి అంతగా సరైన సెక్యూరిటీ విధానాన్ని ఫాలో అవట్లేదని, దాని వల్ల ప్రైవసీ ఇబ్బందులు తలెత్తుతాయని కొన్ని సంస్థలు హెచ్చరిస్తున్నాయి. 
ఎటుచూసినా నష్టమే..

డేటింగ్ యాప్స్ ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు 90శాతం మంది తమ మొబైల్ డేటాను, కెమెరాలను సైతం యాక్సెస్ చేసే అవకాశం (40శాతం యాప్స్కు ఇస్తున్నారు. ఫ్రీ యాప్స్ కు పర్మిషన్లు ఇస్తే మన సమాచారం సేఫ్ గా ఉండదని, హ్యాక్ అయ్యే అవకాశం ఉందని చాలామందికి తెలీదు. ఇలా మానసికంగానూ, హెల్త్ పరంగానూ, సెక్యూరిటీ పరంగానూ ఎటు చూసినా డేటింగ్ యాప్స్ వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ ఉందని నిపుణుల అభిప్రాయం.