కన్న తండ్రిని చంపిన కూతురు.. కారణం ఇదే..!

కన్న తండ్రిని చంపిన కూతురు.. కారణం ఇదే..!

వేరే మహిళతో అక్రమ సంబంధాన్ని పెట్టుకోవడమే కాకుండా.. ఆమెను ఇంటికి తీసుకొచ్చాడని కన్న తండ్రిని ఓ కూతురు చంపేసింది. ఈ ఘటన ఆంధ్ర ప్రదేశ్ విశాఖ జిల్లా కంచర పాలెంలో జరిగింది. సముద్రయ్య (48) అనే అతను రైల్వే లో పని చేస్తున్నాడు. భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటున్న ఓ మహిళతో సముద్రయ్యకు పరిచయం ఏర్పడింది. అది కాస్తా అక్రమసంబంధానికి దారి తీసింది. అయితే.. గురువారం రాత్రి సముద్రయ్య అతని ప్రియురాలిని ఏకంగా తన సొంత ఇంటికే తీసుకెళ్లాడు. దీంతో అతని భార్య వారించింది. కోపానికి వచ్చిన సముద్రయ్య అతని భార్యను విచక్షణారహితంగా కొట్టాడు. తల్లిని కొట్టడం చూసి తట్టుకోలేకపోయిన వారి కూతురు బిబాషా తండ్రిని అడ్డుకుంది. దీంతో బిబాషాను కూడా కొట్టాడు సముద్రయ్య.

తండ్రి చర్యలతో తీవ్ర మనస్థాపానికి గురైన బిబాషా… క్షణికావేశంలో సముద్రయ్య ను అక్కడే ఉన్న అతని ప్రియురాలిని కత్తితో పొడిచింది. సముద్రయ్యకు కత్తి లోతుగ దిగడంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు. అతని ప్రియురాలికి కత్తి గాట్లు ఎక్కువగా పడటంతో స్థానికులు ఆమెను హాస్పిటల్ కు తరలించారు. ఘటనా స్థాలానికి చేరుకున్న పోలీసులు బిబాషాను, ఆమె తల్లిని  అదుపులోకి తీసుకున్నారు.