ప్రియుడి సాయంతో తల్లిని హత్య చేసిన కూతురు అరెస్ట్

ప్రియుడి సాయంతో తల్లిని హత్య చేసిన కూతురు అరెస్ట్

హైదరాబాద్ హయత్ నగర్లో  తల్లిని చంపిన కూతురు  కేసులో నిందితులను అరెస్ట్ చేశారు రాచకొండ పోలీసులు. మర్డర్ కేసులో కూతురు కీర్తితో పాటు ఆమె ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ శశికుమార్, బాల్ రెడ్డిలను అరెస్ట్ చేశారు. హత్యకు సహకరించినందుకు శశికుమార్ ని కీర్తిని రేప్ చేసినందుకు బాల్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. మర్డర్ ప్లాన్ చూస్తుంటే  దృశ్యం మూవీ సీక్వెల్ లా అనిపించిందన్నారు రాచకొండ సీపీ మహేశ్ భగవత్. పోలీసులకు దొరక్కుండా నిందితులు చాలా జాగ్రత్త పడ్డారని తెలిపారు. కీర్తి భాయ్ ఫ్రెండ్ శశికుమార్ ఆమె ఆస్తిపై కన్నేసి హత్యకు ప్లాన్ వేశాడన్నారు సీపీ మహేశ్ భగవత్.

రజిత హత్యకు సంబంధించి మరిన్ని విషయాలు తెలిపారు  సీపీ మహేశ్ భగవత్…

కీర్తి ఇంటి సమీపంలో ఉండే బాల్‌రెడ్డి .. ఫ్రెండ్ షిప్ పేరుతో ఆమెను రేప్ చేశాడు. దీంతో గర్భవతి అయిన కీర్తికి…శశికుమార్ అనే వ్యక్తి సహాయం తీసుకుని అబార్షన్ చేయించారు. అదే అదనుగా తీసుకున్న శశికుమార్‌ ఇంట్లో ఈ విషయం చెబుతానని కీర్తిని బ్లాక్ మెయిల్ చేసి లొంగదీసుకున్నాడు. దీంతో పాటు కీర్తి ఆస్తిపై కూడా కన్నేశాడు. ఒ రోజు క్లోజ్ ఉన్న వీరిద్దరినీ చూసిన తల్లి రజిత ఆగ్రహం వ్యక్తం చేయడంతో పేమించుకుంటున్నామని..పెళ్లి చేసుకుంటాని శశి చెప్పాడు. అయితే వీరి పెళ్లికి కీర్తి తల్లి రజిత అడ్డు చెప్పింది.

పెళ్లికి అంగీకరించక పోవడంతో  రజిత ను హత్య చేయాలని పథకం వేశాడు శశి. కీర్తితో క్లోజ్ గా ఉన్న సమయంలో ఫొటోలు , వీడియోలు తీశాడు శశి. వాటిని ఆమెకు చూపించి కీర్తిని బ్లాక్ మెయిల్ చేశాడు. దీంతో తల్లిని చంపేందుకు ఒప్పుకుంది కీర్తి.  ఇద్దరు కలిసే తల్లి రజితను గొంతు నులిమి చంపేశారు. మూడు రోజుల తర్వాత మృతదేహాన్ని కారులో తీసుకెళ్లి రామన్నపేట దగ్గర రైలు పట్టాలపై పడేశారు. రజిత ను హత్య చేసిన తర్వాత రజిత ఫోన్ నుండి బాల్ రెడ్డి కి స్వయంగా కీర్తి ఫోన్ చేసి తల్లి లాగా మాట్లాడింది. తాను వైజాక్ కి వెల్లుతున్నా, కీర్తి ఇంట్లో ఉంటుందని చెప్పి తల్లిగా మాట్లాడింది.

గతంలో కూడా తల్లికి నిద్రమాత్రలు ఇచ్చి చంపేందుకు కీర్తి ప్రయత్నించింది. నిందితుల దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న4  మొబైల్‌ ఫోన్లలో చాలా ఆధారాలున్నాయి. నేరం తమపైకి రాకుండా ఉండేందుకు కీర్తి, శశికుమార్‌ చాలా ప్రయత్నాలు చేశారు. హత్య చేసిన తర్వాత కీర్తి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తన తల్లి కన్పించడం లేదని ఫిర్యాదు చేసింది. ఈ కేసులో అన్ని కోణాల్లో విచారణ జరిపి నిందితులను అరెస్ట్‌ చేశాం .

మొత్తం 4 కేసులు నమోదు చేశాం. శశికుమార్, కీర్తి పై 302 , 201, 203 , రెడ్ విత్ 34- ఐపీసీ కింద కేసు నమోదు చేశారు.  కీర్తిని రేప్ చేసిన బాలరెడ్డి పై 376 (2) (n) , 312 , సెక్షన్ 5&6 పొక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశామని తెలిపారు.