
నల్లగొండ జిల్లా కేంద్రంలో నరేంద్ర మోడి, అమిత్ షాలకు నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు తల్లిదండ్రులు. నరేంద్ర మోడీ ఏంటి? అమిత్ షా ఏంటి? వాళ్లకు పట్టు వస్త్రాలంకరణ ఏంటి అని అనుకుంటున్నారా? మీరు విన్నది చూస్తున్నది నిజమే.
నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఓల్డ్ సిటీకి చెందిన మద్ది ప్రసాద్, లక్ష్మీ ప్రసన్నలకు ఇద్దరు కుమారులు. వారికి మొదటి నుంచి బీజేపీ , నరేంద్ర మోడీ,అమిత్ షా అంటే పిచ్చి అభిమానం. ఆ అభిమానంతో వారి ఇద్దరు కొడుకులకు నరేంద్రమోడీ, అమిత్ షా గా పెట్టుకున్నారు. జులై 27న వారికి నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవం నిర్వహించారు. నరేంద్ర మోడీ, అమిత్ షా పేర్లు కావడంతో ఈ ఫంక్షణ్ అందరి దృష్టి ఆకర్షిస్తోంది.
►ALSO READ | డేట్,టైం ఫిక్స్ చెయ్..సీఎం రమేష్ను తీసుకొస్తా..కేటీఆర్కు బండి సంజయ్ సవాల్