డేట్,టైం ఫిక్స్ చెయ్..సీఎం రమేష్ను తీసుకొస్తా..కేటీఆర్కు బండి సంజయ్ సవాల్

డేట్,టైం ఫిక్స్ చెయ్..సీఎం రమేష్ను తీసుకొస్తా..కేటీఆర్కు బండి సంజయ్ సవాల్

సోషల్ మీడియా ద్వారా ప్రధాని సహా బీజేపీ నేతలపై బీఆర్ఎస్ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ఇకపై తప్పుడుప్రచారం చేస్తే అంతు చూ స్తామని.. తమ కార్యకర్తలు ఎక్కడికక్కడ అడ్డుకుంటార ని.. ఖబడ్డార్ కేటీఆర్ అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై సీఎం రమేశ్ చెప్పింది నిజమే దమ్ము కేటీఆర్ కు ఉందా? అని ప్రశ్నించారు. డేట్, టైం ఫిక్స్ చేసి చర్చకు రావాలని ఆయనకు సవాల్ విసిరారు. కరీంనగర్ జిల్లా ఆస్పత్రిలో క్రిటికల్ కేర్ బ్లాక్ నూతన భవనాన్ని ప్రారం భించిన అనంతరం బండి మీడియాతో మాట్లాడారు. 

'సీఎం రమేష్ ను రప్పించి వేదిక ఏర్పాటు చేయిస్త. బహిరంగ చర్చకు తేదీ, సమయం కేటీఆర్ చెప్పాలి. కుటుంబ, వారసత్వ పార్టీలకు బీజేపీ దూరం. ప్రధాని మోదీ కూడా నిజామాబాద్ సభలో ఇదే చెప్పారు. అవినీతి, కుటుంబ పార్టీ అయిన బీఆర్ఎస్ ను విలీనం చేసుకునే ప్రసక్తే లేదు. రాష్ట్రం లో వాళ్ల పనైపోయింది. ఆ పార్టీని నడపలేక కేసీఆర్ చేతులెత్తేశా రు. బీఆర్ఎసీడర్లు పూర్తిగా అవినీతి ఊబిలో కూరుకుపోయా రు. ఆ ఆక్రోశంతోనే కేటీఆర్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. సీఎంను తిడుతున్నా స్పందించలేని దద్దమ్మలు కాంగ్రెస్ నేతలు' అంటూ మండిపడ్డారు.

►ALSO READ | బోరబండకు రూ. 12 కోట్లు నిధులు కేటాయిస్తాం.. అభివృద్ధి చేసుకుందాం

కాంగ్రెస్ రాజకీయ కుట్ర

'బోనాల పండుగ సమయంలో జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడిని కూల్చడం హిందువుల మనోభావాలను గాయపరిచే చర్య. రాష్ట్రం లో రోడ్డుకు అడ్డంగా ఎన్ని చర్చిలు, మసీదులు ఉన్నాయి? ఒక్క గుడిని మాత్రమే ఎందుకు టార్గెట్ చేశారు? ఈ కూల్చివేత వెనుక రాజకీయ లబ్ధి కోసం ఒక వర్గం ఓట్లను ఆకర్షించే కుట్ర ఉంది. తక్ష ణమే బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేయాలి. లేనిపక్షంలో హిందువుల దమ్మేందో చూపిస్తం. తెలంగాణలో హిందువులను మైనారిటీలుగా చేసే కుట్ర జరుగుతోంది. ఆ విషవృక్షాన్ని అడ్డు కోకుంటే దేశమంతా విస్తరించే ప్రమాదం ఉంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తేనే మద్దతిస్తం. మోదీ కన్వర్టెడ్ బీసీ అయితే... రాహుల్ గాంధీది ఏ కులం? ఏ మతం చెప్పాలి. రాహుల్ తల్లి క్రిస్టియన్, తాత ముస్లిం నుంచి వేరుపడ్డ పార్శీ మత స్తుడు. అందుకే హిందుత్వను ధ్వంసం చేస్తామని విషం కక్కుతు న్నాడు' అని బండి సంజయ్ ఫైర్అయ్యారు.