బోరబండకు రూ. 12 కోట్లు నిధులు కేటాయిస్తాం.. అభివృద్ధి చేసుకుందాం: మంత్రి వివేక్ వెంకటస్వామి

బోరబండకు రూ. 12 కోట్లు  నిధులు కేటాయిస్తాం.. అభివృద్ధి చేసుకుందాం: మంత్రి వివేక్ వెంకటస్వామి

ఆదివారం  ( జులై 27 ) బోరబండ స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఈ సందర్భంగా కార్యకర్తలతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి వివేక్. కార్యకర్తలంతా కలిసి పనిచేసి పార్టీని స్ట్రాంగ్ చేసుకోవాలని అన్నారు. కార్యకర్తలు ప్రజల సమస్యలను వినాలని... బాబా ఫసియొద్దీన్ బోరబండ సమస్యలపై లిస్ట్ ప్రిపేర్ చేసి తనకు ఇచ్చారని..  ఒక్కొకటిగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు మంత్రి వివేక్. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ తో కూడా మాట్లాడానని అన్నారు.

బోరబండలో సీసీ రోడ్లు, రోడ్ వైండింగ్ లాంటి సమస్యలను పరిష్కరిస్తానని.. రూ. 10 నుంచి 12 కోట్ల రూపాయలు నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు మంత్రి వివేక్. బూత్ కమిటీలను స్ట్రాంగ్ చేసుకొని భవిష్యత్తులో బోరబండను అభివృద్ధి చేసుకుందామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు మంత్రి వివేక్. ఇంచార్జ్ మంత్రి పొన్నం పైన ఒత్తిడి తెచ్చి ఇంకా ఎక్కువ నిధులు తెచ్చుకోవాలని అన్నారు.

రేషన్ కార్డుల కోసం పదేళ్లుగా ఎదురు చుసినవారికి రేవంత్ సర్కార్ లో రేషన్ కార్డ్స్ వస్తున్నాయని అన్నారు. బోరబండ డివిజన్ కు సంబంధించి కార్డు వచ్చిన, రానివారి లిస్ట్ రెడీ చేయాలని అన్నారు. రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంటు ఇస్తున్నామని.. రాజీవ్ ఆరోగ్య శ్రీ 10 లక్షలకు పెంచుకున్నామని అన్నారు మంత్రి వివేక్. ఇందిరమ్మ ఇళ్లను ఎక్కువ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నామని..  ఇక్కడ ఇంకా అవసరం ఉంటే ఇస్తామని అన్నారు. 

కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు సన్న బియ్యం ఇస్తున్నామని.. మన పిల్లలకు మంచి భోజనం పెడ్తున్నామని అన్నారు.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలని, తాము అండగా ఉంటామని అన్నారు. బోరబండకు కావాల్సినన్ని నిధులు కేటాయించే బాధ్యత తనదేనని అన్నారు మంత్రి వివేక్.