ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలి: ఎంపీ ఆర్.కృష్ణయ్య

ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలి: ఎంపీ ఆర్.కృష్ణయ్య

ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 14 లక్షల మంది విద్యార్థులకు స్కాలర్​షిప్, ఫీజు రీయింబర్స్​మెంట్​బకాయిలు రూ.6 వేల కోట్లను వెంటనే చెల్లించాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఫీజు బకాయిల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలన్నారు. బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జిల్లపల్లి అంజి, నీల వెంకటేశ్​అధ్యక్షతన ఫీజు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో విద్యార్థులతో కలిసి భారీ ధర్నా చేపట్టారు. 

కృష్ణయ్య మాట్లాడుతూ.. అనేక పథకాలకు లక్షల కోట్ల అప్పులు తెస్తున్నారని, లక్షలాది మంది విద్యార్థుల కోసం రూ.6 వేల కోట్లు తెస్తే ఎవరూ అడ్డుకోరన్నారు.  రాష్ట్రంలో కొత్తగా 100 బీసీ కాలేజ్ హాస్టళ్లు మంజూరు చేసి, గురుకుల పాఠశాలల్లో 20 శాతం సీట్లు పెంచాలని కోరారు. నాయకులు అనంతయ్య, రాజేందర్, రవికుమార్ యాదవ్, నందగోపాల్, సతీశ్, మోడీ రాందేవ్, బాలయ్య, శివ యాదవ్, నరేశ్ గౌడ్, పృథ్వీ గౌడ్ తదితరులున్నారు.