
శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నిత్యం రద్దీతో ఉంటుంది. రోజు వేలాది మంది ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు. అయితే ఇక్కడ ర్యాంప్ పార్కింగ్ పెద్ద సమస్యగా మారింది. ఎందుకంటే ర్యాంప్ పార్కింగ్ నిబంధనలు, చార్జీలు ప్రయాణికుల జేబులకు చిల్లు పెడుతున్నాయి. డ్రాపింగ్ కు లేదా పికప్ కు వచ్చి కారు ర్యాంప్ లోకి వెళ్తే అదనపు బాదుడు బాదుతున్నారు. ఎందుకంటే ర్యాంప్ లోకి వెళ్లాక 8 నిమిషాలలోపే మళ్లీ బయటకు వెళ్లాలి. ఒక్క క్షణం ఎక్కువ ఉన్నా ముక్కు పిండి మరీ రూ.250 అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారు ఎయిర్ పోర్ట్ సిబ్బంది.
ఒక్కోసారి ఇతర వాహనాల వల్ల కూడా ఆలస్యం అవుతోంది.దీంతో అదనంగా చార్జీలు కట్టాల్సి వస్తోంది. ఎలా అంటే.. ర్యాంప్ లోకి వెళ్లిన వాహనాలు బయటకు వెళ్లే టపుడు ట్రాఫిక్ జామ్ అవుతున్నా సిబ్బంది పట్టించుకోరు. దీంతో ఆలస్యం అవతుంది.ఈ కారణంగా కూడా అదనపు ఫీజు కట్టాల్సి వస్తోంది. దీని వల్ల వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.
ర్యాంప్ పార్కింగ్ నిబంధనలు ,ఛార్జీలు
- ర్యాంప్ పార్కింగ్ మొదటి 8 నిమిషాల వరకు ఉచితం
- 8 నుంచి 10 నిమిషాల వరకు రూ. 250 అదనపు ఛార్జ్
- 10 నుంచి 15 నిమిషాల వరకు రూ. 500 అదనపు ఛార్జ్
- 15 నిమిషాలకు మించి వాహనాన్ని ర్యాంప్‌పై ఉంచితే, ఆ వాహనాన్ని క్రేన్ సాయంతో తీసుకెళ్లే చాన్స్ ఉంది
- టూ వీలర్ వెహికల్స్, ఆటోరిక్షాలను ర్యాంప్‌ల పైకి అనుమతించరు
కేంద్ర లేదా రాష్ట్ర మంత్రులు, MPలు, MLAలు, ఉన్నత ప్రభుత్వ అధికారులు, విదేశీ అధికారిక ప్రతినిధి బృందాలు, సైన్యం, పోలీసు అధికారులు, ప్రోటోకాల్ విభాగానికి చెందిన VIP,VVIPల కోసం ప్రత్యేక VIP పార్కింగ్ సదుపాయం ఉంది.