కువైట్ కొత్త రూల్.. ఇంతకు మించి మీ దగ్గర ఉంటే సీజ్.. లెక్కచెప్పాల్సిందే..!

కువైట్ కొత్త రూల్.. ఇంతకు మించి మీ దగ్గర ఉంటే సీజ్.. లెక్కచెప్పాల్సిందే..!

కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంతో సహా అంతర్జాతీయ ఎయిర్ పోర్టుల్లో కస్టమ్స్ రూల్స్ ఇప్పుడు మరింత కఠినంగా మార్చేసింది. సమాచారం ప్రకారం, కువైట్‌ వెళ్లే వాళ్లు కువైట్ దినార్ 3,000 అంటే సుమారు రూ.8,49,387 కంటే ఎక్కువ ఉన్న నగదు లేదా ఏదైనా విలువైన వస్తువులు ఉంటే తప్పనిసరిగా ప్రకటించాలి. ఈ కొత్త రూల్ కూడా జూలై నుండే అమలు చేసింది. 

ఈ రూల్ మనీలాండరింగ్ అంటే అక్రమంగా డబ్బు  రవాణా, స్మగ్లింగ్ వంటి అంతర్జాతీయ నేరాలను అరికట్టేందుకు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ప్రవేశపెట్టింది. అలాగే జరిమానాలు పడకుండా ఉండాలంటే ప్రయాణికులు తెలుసుకోవాల్సిన విషయాలను కూడా సూచించింది. 

ఎలాంటి వస్తువులను ప్రకటించాలి: కొత్త నిబంధనల ప్రకారం, కువైట్‌కి వచ్చే వాళ్ళు లేదా కువైట్‌ నుండి వెళ్లేవారి వద్ద 3,000 కువైట్ దినార్లు (KWD) కంటే ఎక్కువ డబ్బు ఉన్నా లేదా దానికి సమానమైన విలువైన వస్తువులు ఉంటే వాటిని తప్పనిసరిగా  తెలియజేయాలి. వాటిలో డబ్బు, బంగారం, ఏవైనా విలువైన లోహాలు లేదా వస్తువులు, ధరించే ఆభరణాలు, కాస్ట్లీ వాచీలు, బ్రాండెడ్ బ్యాగులు లేదా  మొదలైనవి, లేటెస్ట్ ఎలక్ట్రానిక్స్ అంటే స్మార్ట్ ఫోన్స్, ల్యాప్‌టాప్‌లు వంటివి, బాండ్లు, చెక్కులు లేదా ప్రామిసరీ నోట్లు వంటి డాకుమెంట్స్ ఉన్నాయి. ఈ నియమం విదేశీ పర్యాటకులు, అక్కడ ఉండే ఇతర ప్రవాసులు, కువైట్‌కు తిరిగి వస్తున్న పౌరులు, GCC (గల్ఫ్ కో-ఆపరేషన్ కౌన్సిల్) దేశాల పౌరులు అందరికీ వర్తిస్తాయి.

ఎందుకు ఈ రూల్ : కువైట్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్  ప్రకారం, ఈ కొత్త నిబంధన మనీలాండరింగ్, అక్రమాలు, స్మగ్లింగ్ వంటి  నేరాలను అరికట్టడానికి తీసుకున్న చర్యల్లో భాగంగా వస్తుంది. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF), అలాగే ప్రపంచ కస్టమ్స్ ఆర్గనైజేషన్ (WCO) పాటించాల్సిన నియమాలను కువైట్ పాటిస్తోందని దీని ద్వారా తెలుస్తోంది. ఇలా చేయడం వల్ల గల్ఫ్ దేశాల్లో ముఖ్యంగా కువైట్, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూసుకుంటోంది.

విలువైన వస్తువులను ఎక్కడ ప్రకటించాలి: విలువైన వస్తువులు లేదా నగదు తీసుకెళ్లేవారు టెర్మినల్ నుండి బయలుదేరే ముందు లేదా ప్రవేశించే ముందు కస్టమ్స్ చెక్‌పాయింట్ వద్ద వాటిని ప్రకటించాలి. విమానాశ్రయంలో బ్యాగేజీ క్లెయిమ్ అండ్ ఎగ్జిట్  దగ్గర ఉన్న కస్టమ్స్ కౌంటర్లలో మీ విలువైన వస్తువులను ప్రకటించవచ్చు.  అలాగే కువైట్ ఎలక్ట్రానిక్ కస్టమ్స్ ఆన్‌లైన్  పోర్టల్ ద్వారా కూడా ముందగా డిక్లరేషన్చే సుకోవచ్చు. అలాగే మీరు ఇన్‌వాయిస్‌లు, రిసిప్ట్లు  లేదా ప్రూఫులకు సంబంధించిన పేపర్స్ ఇతర డాకుమెంట్స్ వంటివి అన్నింటినీ మీ దగ్గర ఉండేల చూసుకోవాలి.

ప్రకటించకపోతే ఏమి జరుగుతుంది: ఈ రూల్ పాటించని వారికి తీవ్రమైన సమస్యలు కలగొచ్చు. ఇందులో మీరు ప్రకటించని నగదు లేదా వస్తువులను వెంటనే స్వాధీనం చేసుకోవడం, జరిమానాలు ఇంకా శిక్షలు, కువైట్  చట్టాల ప్రకారం చర్యలు, తాత్కాలిక జైలు లేదా కొన్ని సందర్భాల్లో బ్లాక్‌లిస్టింగ్ ఉండొచ్చు. 

అందుకే  విమానాశ్రయానికి వెళ్లే ముందే, మీ దగ్గర ఉన్న వస్తువుల విలువ ఎంతో మొత్తం ఎంత ఉంటుందో తెలుసుకోండి లేదా ఒక అంచనా వేయండి. ఇది మీకు డిక్లేర్ చేయడానికి ఉపయోగపడుతుంది. బంగారం, వాచీలు, ఎలక్ట్రానిక్స్ వంటి విలువైన వస్తువులను మీ హ్యాండ్ బ్యాగులో పెట్టుకోండి. అలాగే వాటి ఒరిజినల్  ప్యాకేజింగ్ చింపకుండా ఉంటే చాల మంచిది.