టిబెట్లో భూకంపం.. గంటల వ్యవధిలో మయన్మార్లో కూడా.. పరుగులు తీసిన జనం

టిబెట్లో భూకంపం.. గంటల వ్యవధిలో మయన్మార్లో కూడా.. పరుగులు తీసిన జనం

తూర్పు ఆసియా దేశాలలో వరుస భూకంపాలు సంభవించాయి. , టిబెట్,  మయన్మార్ దేశాలలో ఆదివారం (జులై 27)  వెంట వెంటనే భూకంపాలు సంభవించాయి. భూ ప్రకంపనలతో ఇరు దేశాల్లో భవంతులు, ఇళ్లు అక్కడక్కడ నేలమట్టం అయ్యాయి. 

మయన్మార్ లో 3.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. 161 కిలోమీటర్లలో లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు భూకంప కేంద్రం ప్రకటించింది. ఆదివారం రాత్రి 10 గంటల 45 నిమిషాలకు భూకంపం సంభవించడంతో ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు. 

ఇక టిబెట్ దేశంలో కూడా భూకంపం సభవించింది. రిక్టర్ స్కేలుపై 3.7 తీవ్రతతో భూ ప్రకంపనలు వచ్చాయి. టిబెట్ జాతీయ భూకంప కేంద్రం ప్రకారం..  5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపింది. మధ్యాహ్నం 2 గంటల 43 నిమిషాలకు వచ్చిన భూకంపంలో అక్కడక్కడ భవంతులు నేల కూలాయి. కొన్ని బిల్డింగ్స్ పెచ్చులూడి కిందపడ్డాయి. సడెన్ గా భూమి కంపించడంతో ఇళ్లలో సామాన్లు కింద పడ్డాయి. దీంతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు.