HHVM Collection: హరి హర వీరమల్లుకు ఊహించని కలెక్షన్స్.. మూడ్రోజుల్లో ఎన్ని కోట్లంటే?

HHVM Collection: హరి హర వీరమల్లుకు ఊహించని కలెక్షన్స్.. మూడ్రోజుల్లో ఎన్ని కోట్లంటే?

హరి హర వీరమల్లు బాక్సాఫీస్ వద్ద మోస్తారు వసూళ్లను రాబడుతోంది. మూడు రోజుల్లో హరి హర వీరమల్లు సినిమాకు ఇండియాలో రూ.66 కోట్లకు పైగా నెట్ వసూళ్లు వచ్చాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. వరల్డ్ వైడ్‌గా రూ.90కోట్లకి పైగా గ్రాస్ వచ్చినట్లు  ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, మూడు రోజుల్లో గ్రాస్ కలెక్షన్స్ ఎంతనేది మేకర్స్ నుంచి ఎటువంటి సమాచారం లేదు. 

ట్రేడ్ సంస్థ సక్నిల్క్ ప్రకారం:

హరి హర వీరమల్లు సినిమాకు ఇండియాలో మూడు రోజుల కలెక్షన్స్ భారీ దిశగా వెళ్లడంలేదు. రోజువారీ వసూళ్ళలో చాలా వ్యత్యాసం కనిపిస్తూ ఉంది. ఫస్ట్ డే గురువారం (జులై24న) రూ.34కోట్ల నెట్ రాబట్టింది. రెండో రోజు (శుక్రవారం) సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో.. కేవలం రూ.8 కోట్లు మాత్రమే రాబట్టింది.

మూడో రోజు శనివారం రూ.9.86 కోట్ల నెట్ కలెక్షన్స్ దక్కించుకుంది. మూడో రోజు కాస్తా మోస్తరుగా ముందుకు వచ్చినప్పటికీ.. చాలా తక్కువే వసూళ్లు చేసింది. ఇకపోతే, ప్రీమియర్ షోలకు (జులై23న) రూ.12 కోట్లు వచ్చాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. 

ఓవరాల్గా మూడు రోజుల్లో ఇండియాలో వీరమల్లు సినిమాకు రూ. 65.88 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. అయితే, అందులో అత్యధికంగా ఫస్ట్ డే (గురువారం) రూ.34 కోట్లు రాబట్టింది. రోజురోజుకూ వీరమల్లు లెక్కలు క్రమంగా తగ్గతూ వస్తున్నాయి. వీకెండ్ లోనే ఈ మాదిరి వసూళ్లు వస్తున్నాయంటే.. బ్రేక్ ఈవెన్ రీచ్ అవ్వడం కష్టమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు.

►ALSO READ | VijayRashmika: విజయ్ ఇంటెన్స్ ఫైర్ చూడాలని వెయిటింగ్.. రష్మిక అదిరిపోయే ట్వీట్

ఇదిలా ఉంటే.. తెలుగు రాష్ట్రాలలో వీరమల్లు లాభాల్లోకి రావాలంటే రూ.103కోట్ల డిస్ట్రిబ్యూషన్ షేర్, రూ.210 కోట్ల గ్రాస్ రాబట్టాల్సి ఉంది. వరల్డ్ వైడ్‌గా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.127 నుంచి 130 కోట్ల షేర్.., రూ.250 కోట్ల నుంచి 260 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.